2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఘోరపరాజయాన్ని చవి చూసిన టీడీపీ నాయకులు 2024 నాటికి మళ్ళీ అధికారంలోకి రావడానికి తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. 2024 ఎన్నికల్లో నారా లోకేష్ ను రాష్ట్రానికి టీడీపీ అధినేత. చంద్రబాబు నాయుడు, టీడీపీ సీనియర్ నేతలు చాలా పతకాలు రచిస్తున్నారు. ఆ వ్యూహాల్లో మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కూడా ఒకటి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఒక్కసారి కూడా ఒంటిరిగా ఎన్నికల్లో గెలిచిన సందర్భం లేదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలవడానికి బీజేపీ, జనసేన ముఖ్య పత్రం పోషించాయి.
వైసీపీ-బీజేపీకి చిచ్చు పెట్టిన పోలవరం
2019 ఎన్నికల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా పోటీ చేసినప్పటికీ బీజేపీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిదనే వ్యాఖ్యలు టీడీపీ నుండి, రాజకీయ విశ్లేషకులు నుండి కూడా చాలా గట్టిగా వినిపించాయి. రాష్ట్రంలో వైసీపీకి బీజేపీ అవసరం లేదు, సెంట్రల్ లో బీజేపీకి వైసీపీ అవసరం లేదు. కానీ రెండు పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం కలిసి పని చెయ్యడానికి సిద్ధమయ్యాయి. కానీ పోలవరం రూపంలో ఇప్పుడు రెండు పార్టీల విభేదాలు వచ్చాయి. పొలవరాన్ని అడ్డుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని వైసీపీ నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు. పోలవరానికి కావలసిన నిధులను ఇవ్వడంలో బీజేపీ రాజకీయాలు చేస్తుందని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొన్నటి వరకు బీజేపీతో కలవడానికి ప్రయత్నించిన జగన్ ఇప్పుడు బీజేపీతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. కానీ బీజేపీపై యుద్ధానికి సిద్ధమైతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులపై బీజేపీ దృష్టి పెడుతుందేమో చూడాలి.
పండగ చేసుకుంటున్న బాబు
2019 ఎన్నికల తరువాత వెంటనే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ అధినేత చాలా ప్రయత్నాలు చేశారు. కానీ బీజేపీ ఒప్పుకోవడం లేదు. బీజేపీ వైసీపీకి దగ్గరవ్వడాన్ని చంద్రబాబు నాయుడు న్అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు పోలవరం విషయంలో బీజేపీకి వైసీపీకి మధ్య గోడవలతో చంద్రబాబు నాయుడు పండగ చేసుకుంటున్నారు. ఒకవేళ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం విషయంలో బీజేపీతో పోరాడకపోతే వైసీపీపై పోరాటం చేస్తూ బీజేపీతో స్నేహం చెయ్యడానికి బాబు సిద్ధమయ్యారు. ఇలా మళ్ళీ బీజేపీకి దగ్గరవ్వడానికి బాబు వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ-వైసీపీ విషయంలో బాబు అంచనా కరెక్ట్ అయితే టీడీపీతో బీజేపీ మళ్ళీ కలవడం ఖాయంగా కనిపిస్తుంది.