జగన్ చెప్పినా కూడా రోజా శాంతించడం లేదా! ఆ నేతల మధ్య గొడవలు సద్దుమనగవా !

Roja telugu rajyam

టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శల నుండి వైసీపీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడిన వాళ్లలో ఎమ్మెల్యే రోజా ఒకరు. జగన్మోహన్ రెడ్డిని విమర్శల నుండి కాపాడటానికి ఆమె అనేకసార్లు విమర్శలపాలు అయ్యారు. ఆమె పార్టీ కోసం చేస్తున్న పనులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తించి ఆమెకు పార్టీలో సముచిత స్థానం కలిపించారు. అయితే ఈ మధ్య కాలంలో రోజా నియోజక వర్గంలో ఉన్న వైసీపీ నేతల నుండి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ నేపథ్యంలో జగన్ చెప్పినా కూడా రోజా వినడం లేదని తెలుస్తుంది.

రోజా vs పెద్దిరెడ్డి

చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రధాన నేతల మధ్య జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కన్పించడం లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాల మధ్య పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విభేదాలు తలెత్తాయి. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు వీరి మధ్య పెద్దగా విభేదాలు లేవు. పవర్ లోకి రాగానే ప్రాబ్లమ్స్ స్టార్టయ్యాయి. రోజా మొదట మంత్రి పదవిని ఆశించారు. అయితే కులాల సమీకరణలో ఆమెకు మంత్రి పదవి ఆమెకు కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి వెళ్ళింది. ఈ విషయంపై రోజా ఆగ్రహంగా ఉన్నారు. అలాగే తన నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వేలు పెడుతున్నారన్నది ఎమ్మెల్యే రోజా ప్రధాన ఆరోపణ. పెద్దిరెడ్డి వర్గం కూడా రోజా విషయంలో ఏమాత్రం తగ్గకూడదనే నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. అలాగే పెద్దిరెడ్డి రోజాకు వ్యతిరేకంగా ఉన్నా నాయకులను కూడా వైసీపీలోకి తీసుకుంటున్నారని కూడా రోజా ఆరోపిస్తున్నారు.

ఈ నేతల మధ్య గొడవలు తగ్గవా!

నియోజక వర్గంలో పెద్దిరెడ్డి చేస్తున్న పనులను రోజా పార్టీ అధిష్టానానికి వివరించడంతో రోజాను శాంతింప చేసేందుకు భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామి ఆమె ఇంటికి వెళ్లి మరీ చర్చలు అప్పట్లో జరిపారు. అయితే రోజాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య రాజీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని చెబుతున్నారు. ఈ గొడవలు పార్టీకి మంచిది కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా ఇద్దరు నేతలు వినడం లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో టీడీపీ నుండి పార్టీ కోసం ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించడం లేదని రోజా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ గొడవలు ఎప్పుడు సద్దుమనుగుతాయో వేచి చూడాలి.