రాజకీయ నాయకులు కూడా మాట మీద నిలబడుతారు, వాళ్ళు కూడా ప్రజా ప్రయోజనాల కోసమే అన్ని నిర్ణయాలు తీసుకుంటారని అనుకోవడం మన మూర్ఖత్వం. రాజకీయ నాయకులు ఏమి చేసిన వల్ల సొంత ప్రయోజనాల కోసమే చేస్తూ ఉంటారు. వేరే నాయకుడితో గొడవ పడాలన్న, కలిసిపోవాలన్న తమకు లాభం ఉంటే తప్ప ఏమి చేయరు. ఇప్పుడు విజయనగరంలో ఉన్న వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, వీరభద్రం స్వామి మధ్య నెలకొన్న పరిస్థితులు కూడా ఇవే విషయాలను మనకు తెలియజేస్తాయి. ఇద్దరు కొట్టుకున్నా , తిట్టుకున్నా, కలిసి ఉన్నా కేవలం తమ ప్రయోజనాల కోసం మాత్రమే.
ఎవరీ వీరభద్ర స్వామి?
కోలగట్ల వీరభద్రస్వామి మూడు దశాబ్దాలుగా విజయనగరం రాజకీయాల్లో ఉంటూ పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోయారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చాలా నమ్మకస్తుడిగా ఉండేవాడు. తరువాత వైసీపీలోకి వచ్చిన్నప్పుడు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలా నమ్మకంగా ఉండేవారు. జగన్ ఆయనను ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయనగరం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే కొలగట్లకు ఉన్న మంత్రి కావాలనే ఆశకు మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పటి నుండో అడ్డుపడుతున్నారు.
బొత్స-వీరభద్రం గొడవ ఏంటి?
విజయనగరం రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వీళ్లిద్దరికి రాజకీయ గురువు దివంగత కాంగ్రెస్ నేత సాంబశివ రాజు.ఈయన దగ్గరే వీళ్లిద్దరూ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ లో ఉన్నా వైసీపీలో చేరినా కూడా వెనక ఉండి వెన్నుపోట్లు పొడిచింది మాత్రం బొత్స వర్గం అంటారు. అలా బొత్స అంటే కోలగట్ల వర్గం నిప్పులు చెరుగుతుంది. వీరభద్రం మంత్రి కాకుండా అడ్డుకున్నది కూడా బొత్సనే అని రాజకీయ వర్గాలు చెప్తూ ఉంటారు. అలాగే విజయనగరంకు తన కూతురిని మేయర్ కాకుండ కూడా బొత్స అడ్డుపడుతున్నాడని వీరభద్రం భవిస్తున్నారు. ఇలా ఒక్కడి దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్న ఈ నాయకులు ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడటం లేదు. అయితే ఈ మధ్య కాలంలో జగన్ నుండి వచ్చిన ఆదేశాల మేరకు ఇద్దరు కలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.