వైఎస్ జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత బలంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఆయన ఎవరి మాటా వినరు.. అందరూ ఆయనే మాటే వినాలి అంటుంటారు వైసీపీ నేతలు చాలామంది. అలాంటి జగన్ వైసీపీలో ఒకేఒక్క పెద్దమనిషి మాట వింటారట జగన్. ఆయనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పెద్దిరెడ్డికి రాష్ట్ర రాజకీయాల మీద ముఖ్యంగా సీమ రాజకీయాలు మీద మంచి పట్టుంది. వైఎస్ హయాం నుండి పెద్దిరెడ్డి జగన్ కుటుంబానికి సన్నిహితులు. పార్టీ పెట్టిన నాటి నుండి ఆయన జగన్ వెంటే ఉన్నారు. అందుకే పార్టీలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.
పార్టీలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి కీలక నేతలు నెంబవర్ 2 హోదా కోసం పోటీపడుతుంటే పెద్దిరెడ్డి మాత్రం ప్రత్యేక స్థానంలో కూర్చొని ఉన్నారు. జగన్ కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు పెద్దిరెడ్డిగారి జోక్యం తప్పకుండా ఉంటుందట. ఒక్కమాటలో చెప్పాలంటే పెద్దిరెడ్డిగారు జగన్ రైట్ హ్యాండ్. ఈ రైట్ హ్యాండ్ గత ఎన్నికల్లో చంద్రబబు చిత్తుగా ఓడటానికి కీలకంగా పనిచేసిన సంగతి అందరినీ తెలుసు. బాబుగారి సొంత జిల్లా చిత్తూరులో ఆయన పోటీచేసిన ఒక్క కుప్పం మినహా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగిరింది. ఈ క్రెడిట్ పెద్దిరెడ్డిగారిదే. పట్టుబట్టి మరీ చంద్రబాబు మీద యుద్ధం చేసి జిల్లాలో టీడీపీని ఒంటరిని చేశారు.
అయితే చంద్రబాబుకు, పెద్దిరెడ్డికి అభిప్రాయం బేధాలు ఈనాటివి కాదట దాశాబ్దాలనాటివట. అందుకే జలాల రాజకీయాల్లో ఎప్పుడూ ఢీ అంటే ఢీ అంటుంటారు ఇద్దరూ. తాజాగా మరోసారి వీరిమధ్యన ఉన్న విబేధాలు బయటపడ్డాయి. చిత్తూరులో జడ్జి తమ్ముడు మీద జరిగిన దాడికి పెద్దిరెడ్డికి సంబంధం ఉందని, ఆయన్ను విచారిస్తే నిజాలు బయటికొస్తాయని టీడీపీ నేతలు అంటున్నారు. స్థానిక పోలీసులు ముందు పెద్దిరెడ్డిని స్టేషనుకు పిలిచి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం జడ్జి తమ్ముడి మీద దాడి చేసింది టీడీపీ మనుషులేనని అంటున్నారు. దీంతో ఇరు పార్టీల నడుమ వాదోపవాదనలు ఎక్కువయ్యాయి. అయితే ఈ గొడవ వెనుక ప్రధానంగా పెద్దిరెడ్డి వెర్సెస్ చంద్రబాబు అనే కోణం ఉందని పొలిటికల్ టాక్.