Fevicol: ‘ఐడియాలు ఊరికే రావు.. సమయస్ఫూర్తిగా ఆలోచించాలి.. అవకాల్ని మనమే సృష్టించుకోవాలి.. సంక్షోభాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి..’ ఇలాంటి మాటలెన్నో మనం విన్నాం. జీవితాల్ని చూసిన వారు, ఓటమి ఎదుర్కొన్నవారు, ఓటమి నుంచి గెలుపు తీరాలకు చేరుకున్నవారు.. స్వానుభవంతో చెప్పే మాటలివి. ఇవి వినడానికి, చదవడానికి బాగానే ఉన్నా.. ఆచరణలో కాస్త కష్టమే. కానీ.. ఇటువంటి పరిస్థితులను అధిగమించి సాధించినవారే జీవితంలో ఎదుగుతారు.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు. సరిగ్గా ఓ దిగ్గజ సంస్థ ఇదే చేసింది. ఓ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. ప్రశంసలు అందుకుంటోంది. ఆ సంస్థ ‘ఫెవికాల్’. ఏం చూసిందో.. ఏం చేసిందో.. ఏం సాధించిందో చూద్దాం..
పోర్చుగల్ కు చెందిన స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో యూరో ఫుట్ బాల్ చాంపియన్ షిప్ కాన్ఫరెన్స్‌లో వ్యవహరించిన తీరు తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన ముందున్న కోక్ బాటిళ్లను పక్కన పెట్టి మంచినీరు తాగాలంటూ చేసిన సంజ్ఞ ప్రకంపనలు రేపింది. దీంతో ఒక్కసారిగా కోకాకోలా కంపెనీకి రూ.29వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ సంఘటననే తనకు అనుకూలంగా మార్చుకుంది ఫెవికాల్. ఓ ప్రెస్‌కాన్ఫరెన్స్ టేబుల్‌పై కోక్ బాటిళ్లకు బదులు రెండు ఫెవికాల్ బాటిళ్లను ఉంచింది. ‘వీటిని ఎవరూ కదపలేరు.. విలువ పడిపోదు’ అనే కామెంట్ ను జోడిస్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు నెట్టింట్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నెటిజన్లు ఫెవికాల్ క్రియేటివిటీకి ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిజానికి ఫెవికాల్ పనితీరు పక్కనపెడితే.. దశాబ్దాలుగా తన మార్కెటింగ్ స్ట్రాటజీకి అభిమానులు ఎక్కువ. క్రియేటివిటీ, సెన్సాఫ్ హ్యూమర్ తో కూడిన యాడ్స్ టీవీల్లో ఆకట్టుకుంటూంటాయి. ఇప్పుడూ అదే చేసింది. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రొనాల్డో చేష్టలను, కోకాకోలా నష్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం.. నిజంగా మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గొయెంకా కూడా మెచ్చుకున్నారు. ‘క్రియేటివిటీకి హ్యాట్సాఫ్’, ‘క్రియేటివిటీ పీక్స్’, ‘ఇక్కడ రొనాల్డో ఉండుంటే ఏమైపోయేవాడో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్, మార్కెటింగ్ స్ట్రాటజీ వైరల్‌గా మారింది. నెటిజన్లు