ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాలు, మహిళల సంక్షేమమే పెద్ద పీటగా పనిచేస్తున్నారు. మెనిఫెస్టో లో ఉన్న అంశాలతో పాటు, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్నారు. పథకాల అమలులో ఎంత మాత్రం జాప్యం వహించకుండా సీఎం పనిచేస్తున్నారు. ఇక బీసీ సామాజిక వర్గానికి ప్రభుత్వం తొలి నుంచి పెద్ద పీట వేస్తోంది. తాజాగా బీసీల కోసమే కొత్తగా కార్పోరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇది బీసీలకు పండగ లాంటి వార్తే. ఏదైనా కులంలో 30 వేలకు మించి జనాభా ఉంటే అటువంటి కులాల అభివృద్ధి కోసం కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం దేశంలోనే ఇదే ప్రథమం.
30 వేల జనాభా మించిన బీసీ కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్, డైరెక్టర్ ని నియమించనున్నారు. వివిధ పథకాల ద్వారా బీసీ అక్క చెల్లెమ్మలకు ఇప్పటికే 22 వేల కోట్ల పైచీలుక సాయం అందించింది. ఏపీకి సంబంధించినంత వరకూ ఇప్పటికీ వెలుగులోకి రాని ఎన్నో వెనుకబడిన కులాలు ఉన్నాయి. ఈ మాదిరి కులాల్లోని ప్రజలు గత ఏడు దశాబ్ధాలుగా దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. సాధారణ ప్రజలకు పేర్లు కూడా తెలియని ఎన్నో కులాలు ఉన్నాయి. అటువంటి వెనుకబడిన తరగతుల ప్రజలకు ఈ కార్పోరేషన్ల ఏర్పాటు ఓ వరం లాంటిందని చెప్పొచ్చు. ఉపాధి కల్పన, పారిశ్రామిక సహకారం ప్రభుత్వం బీసీల కోసం ఏర్పాటు చేసి అమలు చేస్తోన్న వివిధ పథకాల్లో వీరికి కూడా చోటు దక్కనుంది.
బీసీల సంక్షేమానికి గాను 28 కొత్త కార్పోరేషన్ల ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. కార్పోరేషన్ల ద్వారా గతంలో 69 కులాలనే పరిగణలోకి తీసుకోగా ఈసారి మొత్తం 139కులాలు కవర్ అవుతున్నాయి. కొత్త కులాలతో కలుపుకుని బీసీల కోసం 52 కార్పోరేషన్లను ఏర్పాటు చేయనుంది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు పథకాల ద్వారా ఇప్పటివరకూ 2 కోట్ల 12 లక్షల 40 వేల 810 మంది బీసీలకు 22 లక్షల 685.74 కోట్ల లబ్ధి జరిగింది.