Lord Shiva: శివుడు అభిషేక ప్రియుడు అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆ శివయ్య అనుగ్రహం మనపై ఉండాలంటే పరమశివుడికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకం చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెంది ఆయన కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయని భావిస్తారు. అందుకే స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు పెద్దఎత్తున అభిషేకాలు నిర్వహిస్తుంటారు.అయితే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పుష్పాలతో అభిషేకం చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెందుతారు.
పరమశివుడికి ఉమ్మెత్త పువ్వులు అంటే ఎంతో ప్రీతికరం. ఈ ఉమ్మెత్త పువ్వులతో స్వామికి అభిషేకం చేసి అనంతరం ఉమ్మెత్త మాలతో స్వామి వారిని పూజించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా కుజ దోషం ఉన్నవారు పరమేశ్వరుడికి ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం చేయడం ఎంతో మంచిది.
ఇలా ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం చేయడం వల్ల కుజ దోషం నుంచి విముక్తి పొందవచ్చు. ఇక ఉమ్మెత్త పువ్వులతో స్వామివారికి ప్రదోష సమయంలో అభిషేకం చేయటం వల్ల సకల దేవతల అనుగ్రహం మనపై ఉండి సర్వ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.