పబ్ జీని తలదన్నే యాప్ వచ్చేసింది.. ఇండియాలోనే తయారు.. త్వరలో మార్కెట్ లోకి

FAU-G action mobile game to launch soon, Akshay Kumar tweets this will support PM’s 'AtmaNirbhar' movement

పబ్ జీ గేమ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. అయితే పబ్ జీ గేమ్ ను భారత ప్రభుత్వం ఇటీవలే బ్యాన్ చేసింది. దీంతో త్వరలోనే పబ్ జీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించనున్నారు.

FAU-G action mobile game to launch soon, Akshay Kumar tweets this will support PM’s 'AtmaNirbhar' movement
FAU-G action mobile game to launch soon, Akshay Kumar tweets this will support PM’s ‘AtmaNirbhar’ movement

అది చైనాకు చెందిన యాప్ కావడం.. దానితో పాటు మరికొన్ని చైనా యాప్ లను కూడా ప్రభుత్వం నిషేధించింది. దీనికంటే ముందు కూడా భారత్ చైనాకు చెందిన కొన్ని యాప్స్ ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.

దానితో పాటుగా ప్రధాని నరేంద్ర మోదీ.. ఆత్మనిర్బర్ పేరుతో స్వదేశీ యాప్స్ డెవలప్ చేయాలంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈనేపథ్యంలో భారత్ లో తయారు చేసిన పబ్ జీని తలదన్నే యాప్ ఒకటి వచ్చేసింది. దానిపేరే ఫౌ-జీ(FAU-G). ఈ యాప్ ను బెంగళూరుకు చెందిన ఎన్ కోర్ గేమ్స్ కంపెనీ డెవలప్ చేసింది.

ఫౌజీ యాప్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతాన్ని భారత్ కి వీర్ ట్రస్ట్ కు డొనేట్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. త్వరలోనే ఈ గేమ్ మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది.

ఈ గేమ్ త్వరలో మార్కెట్ లోకి రాబోతోందని.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ గేమ్ లో వినోదంతో పాటుగా… మన భారతదేశ సైనికుల త్యాగాలను కూడా తెలుసుకోవచ్చని అక్షయ్ అన్నారు.