ఫాద‌ర్స్ డే: త‌ండ్రిపై సీఎం జ‌గ‌న్ భావోద్వేగ పోస్ట్

YS Jagan

నేడు ఫాద‌ర్స్ డే దినోత్స‌వం సంద‌ర్భంగా అంతా తండ్రి జ్ఞాప‌కాల్ని నెమ‌ర‌వేసుకుంటున్నారు. సెల‌బ్రిటీలు త‌మ తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తండ్రి గ‌త జ్ఞాప‌కాలు గుర్తు చేసుకుంటూ పాత ఫోటోల్ని అభిమానుల‌తో పంచుకుంటు న్నారు. తండ్రిపై మ‌మ‌కారాన్ని, ప్రేమ‌ని వివిధ రూపాల్లో చాటుకుంటున్నారు. ఇందులో ఎన్నో భావోద్వేగ పోస్టు లున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ఫాద‌ర్ డేను సెల‌బ్రేట్ చేసుకున్నారు. తండ్, మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గురించి ఓ భావోద్వేగ పోస్ట్ చేసారు. నాన్నే నా బ‌లం. ఆద‌ర్శం. జీవితంలో ప్ర‌తి కీల‌క ఘ‌ట్టంలో నాన్నే నాకు స్ఫూర్తిగా నిలుస్తారు. ప్ర‌తీ తండ్రి పిల్ల‌ల గెలుపుకోసం ప్ర‌య‌త్నిస్తాడు. పిల్ల‌ల‌కు ప్రేమ‌ను, స్ఫూర్తిని పంచుతారు. నాన్నే మ‌న‌కు ఫ‌స్ట్ ఫ్రెండ్. గురువు. మ‌న హీరో క‌ష్ట‌కాలంలో ఎప్పుడూ అండ‌గా ఉంటారు. మ‌న సంతోషాల‌న్ని నాన్న‌తోనే పంచుకుంటాం. ప్ర‌తీ తండ్రికి ఫాద‌ర్స్ డే శుభాంకాక్ష‌లు అంటూ సీఎం జ‌గ‌న్ భావోద్వేగ పోస్ట్ చేసారు.

ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుంది. జ‌గ‌న్ తండ్రి వార‌స‌త్వం పుణికి పుచ్చుకుని రాజ‌కీయాల్లో వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దివంగ‌తనేత‌, ప్రియ‌త‌మ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ ప‌రిపాల‌న రాష్ర్టంలో ఓ స్వ‌ర్ణ‌యుగం. ఎన్టీఆర్ త‌ర్వాత అంత గొప్ప‌నాయ‌కుడిగా ప్ర‌జ‌ల్లో ముద్ర వేసుకున్న సీఎంగా వైఎస్సార్ చ‌రిత్త‌కెక్కారు. రెండుసార్లు ముఖ్య‌మంత్రిగా చేసారు. ఆ త‌ర్వాత అనుకోకుండా ప‌ద‌వీ కాలంలోనే హెలికాప్ట‌ర్  ప్ర‌మాదంలో వైఎస్సార్ క‌న్ను మూసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి తండ్రి పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి  ప్ర‌తిప‌క్ష‌నేత‌గా నిలిచారు. అటుపై 2019 ఎన్నిక‌ల్లో 175 స్థానాల‌కు గాను 151 సీట్లతో ఏపీలో ప్ర‌భుత్వాన్ని స్థాపించారు. ప్ర‌స్తుతం తండ్రి ఆశ‌యాల‌కు అనుగుణంగా ముందుకెళ్తున్నారు.