Deepika padukone: ప్రస్థుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు దీపికా పదుకొనే. ఫిబ్రవరి 11న విడుదలైన వెబ్ సిరీస్ “గెహ్రయన్” తో విజయం తన సొంతం చేసుకుంది. దీపిక ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది.ప్రస్తుతానికి దీపిక ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె, పఠాన్, ఫైటర్, హాలీవుడ్ ఫిలిం ది ఇంటర్నెట్ రీమిక్స్ ఆమె చేతిలో ఉన్నాయి.దీపికా పదుకొనే ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకునే కూతురు. ప్రకాష్ పదుకొనేకు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ గా మంచి గుర్తింపు ఉన్నది.
దీపికా పదుకునే ఇటీవల జరిగిన ఒక జాతీయ మీడియా సమావేశంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. తన తండ్రి ప్రకాష్ పదుకునే బయోపిక్ గురించి ప్రకటన చేసి ,తన తండ్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు…..క్రీడల గురించి ఎక్కువ ఎవరికీ అవగాహన లేని సమయంలోనే… అంతర్జాతీయంగా బ్యాడ్మింటన్ క్రీడలో భారతదేశ ఉనికిని చాటిన క్రీడాకారుడు ప్రకాష్ పదుకొనె. ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ప్రతి చిన్న క్రీడాకారుడు ఏ చిన్న కప్పు గెలిచినా కూడా చాలా పాపులారిటీ, ఫేమ్ వస్తోంది. 1983 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచి ప్రపంచాన్ని భారతదేశం వైపు చూసేలా చేసింది. దీనికంటే ముందుగానే 1981 లోనే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలిచి, ప్రపంచ దేశాల్లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు.
దీపికా పదుకొనే నటిగా అవ్వకముందు ప్రకాష్ పదుకొనే కూతురుగానే నాకు గుర్తింపు ఉండేది. ప్రస్తుతం ఉన్నంత ఫెసిలిటీ ఎంకరేజ్మెంట్ అప్పుడు లేక ఒక ఫంక్షన్ హాల్ లో బ్యాడ్మింటన్ కోర్టు తయారు తయారుచేసుకొని ప్రాక్టీస్ చేసే వారిని, ఒకవేళ అప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ ఉండి ఉంటే ఆయన మరిన్ని విజయాలు సాధించే వారని దీపిక ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రకాష్ పదుకొనే బయోపిక్ నిర్మాణ బాధ్యతలు మొత్తం తానే చూసుకుంటానని సంబంధించిన మిగతా సమాచారాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. నిజంగానే దీపికా చెప్పినట్టుగా ప్రకాష్ పదుకొనే బయోపిక్ చేపడితే ప్రకాష్ పదుకునే పాత్రకు ఏ హీరోని ఎంపిక చేస్తారో వేచి చూడాలి.