Crime News: ఈ రోజుల్లో మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయత లకు తావు లేకుండా పోతోంది. బంధాలు బంధుత్వాలు మరిచి డబ్బు మోజులో పడి రక్తసంబంధీకుల్ని కూడా హత్యలు చేయడానికి వెనకాడటం లేదు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు మనస్పర్థల వల్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. నూరేళ్లు కలిసి కాపురం చేయాల్సిన భార్యభర్తలు చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయి ఒకరిమీద ఒకరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన ఇలాంటి సంఘటన ఒకటి తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాలలోకి వెళితే…టమెదక్ జిల్లా,మాసాయిపేట మండలం, పోతనపల్లి గ్రామానికి చెందిన పిట్ట లక్ష్మయ్య, హేమలత దంపతులకు 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. భార్య భర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా హేమలత తన మూడవ కుమారుడు ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యకి సర్ది చెప్పుకొని తిరిగి ఇంటికి తెచ్చుకుందామని లక్ష్మయ్య పోతన్నపల్లి కి వెళ్ళాడు.
దాదాపు 20 సంవత్సరాలుగా సాఫీగా సాగిపోతున్న ఈ సంసారంలో మూడు రోజుల క్రితం జరిగిన చిన్న గొడవ వల్ల భార్య పుట్టింటికి వెళ్ళింది. కూతురికి సర్దిచెప్పి అత్తగారింటికి పంపించాల్సిన తండ్రి అల్లుడు వెళ్లగానే అతనితో గొడవపడి అల్లుడు మీద దాడికి దిగాడు. ఈ దాడిలో లక్ష్మయ్య భార్య హేమలత భర్త చేతులను గట్టిగా పట్టుకో గా హేమలత లక్ష్మయ్య తలమీద కొట్టి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి లక్ష్మయ్య పెద్ద కుమారుడు ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. లక్ష్మయ్య హత్యకు కారణమైన తండ్రి కూతుర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.