వి లవ్ యు దీపికా అంటూ ఫ్యాన్స్ కేకలు.. దీపికా రిప్లై వింటే షాక్..?

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా దీపిక సినిమాలలో నటిస్తోంది. ముఖ్యంగా రణవీర్ తో పెళ్లి జరిగిన తర్వాత కూడా ఈ అమ్మడు రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయంపై అభిమానుల నుండి విమర్శలను ఎదుర్కొన్న దీపిక వాటిని కేర్ చేయకుండా తన కెరీర్ లో దూసుకుపోతోంది.

ప్రస్తుతం దీపిక సినిమాలకి కొంత విరామం ఇచ్చి భర్త రణవీర్ సింగ్ తో కలిసి అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈ జంట కాలిఫోర్నియాలో జరిగిన శంకర్ మహదేవన్ సంగీత కచేరీకి హాజరయ్యారు. అంతే కాకుండా అమెరికాలో ఇటీవల జరిగిన కొంకణి సమ్మేళన్‌కు కూడా ఈ జంట హాజరయ్యారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో రణవీర్ సింగ్‌తో కలిసి వెళ్లిన దీపికా అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కొంకణి సమ్మేళన్ కోసం దీపికా పదుకోణె వేదికపైకి వెళుతున్న సమయంలో అక్కడున్న భారత అభిమానులు.. దీపికా దీపికా అంటూ అరుస్తూ చప్పట్లతో స్వాగతించారు.

అంతే కాకుండా ఆ కార్యక్రమంలో ఉన్న ఓ లేడీ అభిమాని ‘వి లవ్ యు దీపికా ‘ అని గట్టిగా అరిచింది. దీంతో దీపిక ‘ఐయామ్ మ్యారీడ్ విమెన్ నవ్ ‘ అంటూ సరదాగా సమధానం ఇచ్చింది. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే.. దీపికా ప్రస్తుతం బాలీవుడ్‌లో పఠాన్, సర్కస్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్టు కె’ వంటి పాన్ ఇండియా సినిమాలో కూడ నటిస్తూ బిజీగా ఉంది.