Game Changer: తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం గేమ్ చేంజర్. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు,టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇది ఇలా ఉంటే మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మామూలుగా తెలుగు సినిమాలకు ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండియాలో చేయడం మాములే.
కానీ గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏకంగా అమెరికాలో చేస్తున్నారు. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోయే మొట్టమొదటి ఇండియన్ సినిమాగా గేమ్ ఛేంజర్ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అమెరికా డేట్ ప్రకారం డిసెంబర్ 21న ఈ ఈవెంట్ జరగనుంది. అంటే మనకు రేపు ఉదయం ఈ ఈవెంట్ టెలికాస్ట్ ఉంటుంది. అమెరికా డిస్ట్రిబ్యూటర్ రాజేష్ కళ్లేపల్లి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఇప్పటికే రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు, గెస్ట్ గా వెళ్లే సుకుమార్, బుచ్చిబాబు, యాంకర్ సుమ పలువురు గేమ్ ఛేంజర్ నటీనటులు అమెరికాకు చేరుకున్న విషయం తెలిసిందే.
BREAKING: Ram Charan lands at Dallas airport with tremendous craze.🛫✈️🛬 pic.twitter.com/FA5KiMrhyb
— Manobala Vijayabalan (@ManobalaV) December 20, 2024
అక్కడ వీరికి భారీ స్వాగతం పలికారు ఫ్యాన్స్. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రేపు ఉదయం 8:30 గంటలకు మరొక సాంగ్ ని కూడా విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్. అమెరికా తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఈ సినిమాపై ఉన్న హైప్ ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా విడుదల ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.