ఆ విషయంలో వాళ్ళని చూసి నేర్చుకో అంటూ సుధీర్ కి సలహా ఇస్తున్న అభిమానులు..!

బుల్లితెర రారాజుగా గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ ఈ షో ద్వార కమెడియన్ గా బాగా ఫేమస్ అయ్యాడు. సుధీర్ తన టీం తో కలిసి జబర్ధస్త్ లో చేసే స్కిట్ లు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సుధీర్ జబర్ధస్త్ షో కి మూల స్తంభంలా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా సుధీర్ గత కొన్ని రోజులుగా జబర్దస్త్ లో కనిపించడం లేదు. జబర్దస్త్ ద్వారా పేరు ప్రఖ్యాతలు పొందిన సుధీర్.. ఇప్పుడు అదే జబర్దస్త్ ని విడిచి వెళ్ళటంతో తన అభిమానులు కొంతవరకు నిరాశ చెందుతున్నారు.

అయితే సుధీర్ తో పాటు ఆది, శ్రీను, అభి వంటి ప్రముఖ ఆర్టిస్టులు కూడా జబర్ధస్త్ కి దూరంగా ఉంటున్నారు. వీరందరూ ఒకరి తర్వాత ఒకరు జబర్దస్త్ కి దూరం కావడంతో ప్రస్తుతం జబర్దస్త్ పరిస్థితి దారుణంగా తయారైంది. సినిమా అవకాశాలు రావడంతో వీరందరూ తమ పేరుప్రఖ్యాతలు కారణమైన జబర్దస్త్ ని విడిచి వెళ్లారు. సుధీర్ కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలలో నటిస్తున్నాడు. ఇదివరకే సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా బెడిసికొట్టింది. ప్రస్తుతం సుధీర్ చేతిలో అరడజను పైగా సినిమాలు ఉన్నాయి.

అయితే సుధీర్ ఇలా జబర్ధస్త్ విడిచి వెళ్ళటం ఏ మాత్రం సరైనది కాదని సుధీర్ అభిమానులు చెప్పుకొచ్చారు. బుల్లితెర నుండి వెండితెరకి వెళ్లిన వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి తెల్సుకోండి. జబర్దస్త్‌ లో ఉన్నప్పుడు బయట ఎన్ని చేసినా కూడా జబర్దస్త్‌ వల్ల సుధీర్ మీద చాలా పాజిటివ్‌ ఒపీనియన్ ఉండేది. కాని ఇప్పుడు సుధీర్ అభిమానుల్లో ఆ అభిప్రాయం మారే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇదివరకూ సినిమాలు చేయటానికి వెండితెరకి వెళ్లిన జబర్ధస్త్ టీమ్ లీడర్లు ఇప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం వారిని చూసి అయిన సుధీర్ జాగ్రత్త పడకపోతే చాలా నష్టం జరుగుతుంది అంటూ సుధీర్ అభిమానులు సలహా ఇస్తున్నారు. ఇక సుధీర్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి మరి.