Bollywood Actress : బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను వెంటాడిన ఫెయిల్యూర్స్.!

Bollywood Actress : ఆ ముద్దుగుమ్మలు బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోయిన్లు. సెకండ్ ఇన్నింగ్స్‌లో సౌత్‌లో సత్తా చాటాలని ట్రై చేశారు. కానీ, ఘోరమైన పరాభవాలు చవి చూశారు. ఇంతకీ ఎవరా స్టార్ హీరోయిన్లు.? సౌత్‌లో వారు నటించిన ఆ ఫెయిల్యూర్ మూవీస్ ఏంటీ? తెలుసుకుందాం.
భాగ్యశ్రీ.. ఒకప్పుడు సెన్సేషనల్ హీరోయిన్. చేసిన సినిమాలు తక్కువే కానీ, యూత్ హీరోయిన్‌గా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. భాగ్యశ్రీ నటించిన ‘మై నే ప్యార్ కియా’ తెలుగులో ‘ప్రేమ పావురాలు’ పేరుతో రిలీజ్ చేశారు.
సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఆ సినిమా అప్పట్లో. లేటెస్టుగా ఈ సీనియర్ సెన్సేషనల్ భామ ‘రాధేశ్యామ్’ సినిమాలో కనిపించింది. ఈ సినిమా రిజల్ట్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా.
కాజోల్.. ఈ పేరు వినగానే యూత్ గుండెల్లో గుర్రాలు పరుగెత్తేస్తాయంతే. అంతలా కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టేసిందీ అందాల భామ కాజోల్. బాలీవుడ్ హీరోయిన్‌ అయినప్పటికీ సౌత్ జనాలు కూడా కాజోల్‌ని బాగా అభిమానించేవారు. అలాంటిది సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె నటించిన సౌత్ మూవీ ‘రఘువరన్ బీటెక్ 2’ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
అలాగే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన  ‘బ్రూస్‌లీ’ కోసం టిస్కా చోప్రోని, ఎన్టీఆర్ నటించిన ‘శక్తి’ సినిమా కోసం పూజా బేడీని, ప్రబాస్ ప్యాన్ ఇండియా మూవీ  ‘సాహో’ కోసం మందిరా బేడీనీ..
ఇలా చెప్పుకుంటూ పోతే, అలనాటి బాలీవుడ్ క్రేజీయెస్ట్ భామల సౌత్ సెకండ్ ఇన్నింగ్స్ లిస్టు చాలానే వుంది. అన్నింట్లోనూ సేమ్ టు సేమ్. అప్పుడు అక్కడ సూపర్ హిట్టూ, ఇప్పుడు ఇక్కడ అట్టర్ ఫ్లాప్.