మాజీ బాయ్ ఫ్రెండ్ ని చంపేసింది.. అమెరికాలో బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ చెల్లెలి దారుణం!

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు హాట్ హాట్ ఫోటోలతోనూ, మోడలింగ్ షోస్ తోను కాదు. తన చెల్లెలు అలియా చేసిన హత్య విషయంలో ఈమె వైరల్ అవుతుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ చెల్లెలు అలియా మాజీ బాయ్ ఫ్రెండ్ ఎడ్వర్డ్ జాకబ్, అతని ప్రేయసి ఎటినీ హత్య కేసులో అలియా ప్రధాన నిందితురాలిగా ఉంది. ఎడ్వర్డ్ కి చెందిన గ్యారేజీకి అలియా నిప్పంటించడంతో వారు చనిపోయినట్లు న్యూయార్క్ పోలీసులకి సమాచారం రావడంతో ఆమెని అరెస్టు చేశారు.

అలియా, జాకబ్ కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడాది క్రితం ఆమెకు జాకబ్ బ్రేకప్ చెప్పాడు. అప్పటినుంచి అతను మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే ఈ విషయం నచ్చని అలియా వారిద్దరి ప్రేమని తట్టుకోలేకపోయింది, కోపంతో రగిలిపోయిన ఆమె నవంబర్ 2న క్వీన్స్ ప్రాంతంలో జాకబ్, ఎటిని ఇద్దరు కలిసి ఉండగా వారు ఉన్న రెండంతస్తుల గ్యారేజీని తగలబెట్టింది.

ఈరోజు మీరు నా చేతుల్లో చచ్చారంటూ పిచ్చి దానిలాగా ప్రవర్తిస్తూ గట్టిగ కేకలు వేసింది. ఇదంతా చూసిన స్థానికులు పోలీసులు విషయాన్ని చేరవేయడంతో ఆమెని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విషయంగా ఆమెకి బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు జస్టిస్ మిలిందా. అయితే తమ కూతురు ఎలాంటి తప్పు చేయలేదని అలియా తల్లి న్యూయార్క్ మీడియాకు తెలిపారు.

తన కూతురు ఇతరులకు సహాయం చేసే స్వభావం కలదని, మరొకరిని చంపే మనస్తత్వం ఆమెది కాదని చెప్పుకొచ్చింది. అయితే ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఆమె హత్య చేసింది అని చెప్తున్నారు. అయితే ఈ విషయంపై ఆమె అక్క, బాలీవుడ్ నటి అయినా నర్గీస్ ఫక్రి మాత్రం స్పందించలేదు. ఆమె తన సోదరికి 20 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటుందని చెప్తున్నారు నర్గీస్ సన్నిహితులు. ఈ కేసులో అలియా దోషిగా తేలితే జీవిత ఖైదు పడే అవకాశాలు ఉన్నాయి.