నాయకుల కోసం ఆత్మహత్య..? తహశీల్దార్ నాగరాజు మరణంలో నిజాలు

Keesara Tehsildar Nagaraju Telugu rajyam

 పులిమీద స్వారీ చేసేవాళ్ళు ఆ పులికే బలైపోతారు అనే నానుడి అందరికి తెలిసిందే,అలాంటి ప్రమాదకరమైన స్వారీలు సభ్యసమాజంలో అనేక మంది తెలిసో, తెలియకనో చేస్తూ వాటికే బలైపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద లంచం తీసుకున్న కేసుగా నమోదైన కీసర తహశీల్దార్ నాగరాజు కేసు అనేక కీలక మలుపులు తిరిగి చివరికి ఆయన ఆత్మహత్య దగ్గర ఆగిపోయింది. స్థల వివాదానికి సంబంధించిన పత్రాలు ఇచ్చే విషయంలో 2 కోట్లు లంచం డిమాండ్ చేసి, పది లక్షలు నగదు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. దీనితో ఆయన మీద కేసు నమోదు చేసి చంచలగూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు, అదే జైలులో నాగరాజు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దానిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tahsildar Nagaraj Telugu Rajyam

 అతను ఆత్మహత్య చేసుకున్న విషయాన్నీ ద్రువీకరించిన పోలీసులు, ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయాన్నీ చెప్పలేదు. పరువు కోసం పేరు కోసం ఆత్మహత్య చేసుకున్నాడు అనే మాటల్లో వాస్తవం లేదు. ఎందుకంటే 2011 లోనే అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యి, జైలుకు వెళ్లి, సస్పెండ్ అయ్యి తిరిగి విధుల్లో చేరిన చరిత్ర నాగరాజుకు వుంది. ఆయన మాదిరి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు జైలుకు వెళ్లినవాళ్ళే, పరువు కోసం చూసుకునే వాళ్ళు అయితే ఇలాంటి పనులు చేయరు. 2 కోట్ల లంచం విషయంలో రాజకీయ నేతల హస్తముందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వాటాలో నాగరాజు కి వచ్చేది తక్కువే అని, మిగిలింది పై అధికారులకు, అధికార నేతలకు ఇవ్వాల్సి ఉందనే మాటలు కూడా వినవచ్చాయి. మొదటిలో ఆయా నాయకుల పేర్లు కూడా మీడియాలో వినిపించాయి, ఆ తర్వాత సైలెంట్ అయిపోయాయి

 ఈ కేసు సీరియస్ గా విచారణ జరగటంతో రేపొద్దున్న అనేక పెద్ద తలకాయల పేర్లు బయటపడే అవకాశం ఉందని అనుకుంటున్నా నేపథ్యంలో నాగరాజు ప్రాణం జైలు గోడల మధ్య అనంతవాయువులలో కలిసిపోవడం విచారకరం. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. ప్రభుత్వం దీనిపై విచారణ వేగవంతం చేసి, నాగరాజు కు ఎవరెవరి నేతలతో సంబంధాలు ఉన్నాయి..? వాళ్ళందరూ ఇప్పుడు ఏమి చేస్తున్నారు..? నాగరాజు అరెస్ట్ అయినా దగ్గర నుండి వాళ్ళు చేస్తున్న పనులేంటి..? నాగరాజు యొక్క లాయర్లు ఎవరు..? వాళ్ళను నియమించి డబ్బులిస్తుంది ఎవరు..? అనే దానిపై దృష్టి పెడితే నిజాలు బయటకు వస్తాయి. కానీ ఆ స్థాయిలో విచారణ జరుగుతుందని అనుకోవటం కేవలం మన భ్రమ మాత్రమే..? చట్టం డబ్బున్నోళ్లకు, రాజకీయ నేతలకు చుట్టం అని ఊరికే అనలేదు..