షాకింగ్ : బ్యాలెట్ బాక్సులో ఎక్కువగా ఉన్న 33 ఓట్లు.. కౌంటింగ్ నిలిపివేత?

extra votes found in Moula Ali division ballot box

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ పూర్తి కాగానే.. బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది.

extra votes found in Moula Ali division ballot box
extra votes found in Moula Ali division ballot box

తొలి రౌండ్ లో భాగంగా ఓట్లు లెక్కిస్తుండగా.. మౌలాలి డివిజన్ కు చెందిన ఓ బ్యాలెట్ బాక్సులో ఉండాల్సిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. 33 ఓట్లు ఎక్కువగా ఉండటంతో పోలింగ్ సిబ్బంది కంగుతిన్నారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

ఆ బ్యాలెట్ బాక్సులో ఉండాల్సింది 361 ఓట్లే. కానీ.. 394 ఓట్లు ఉండటంతో వెంటనే కౌంటింగ్ ను నిలిపివేశారు. దీనిపై ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.