Ex Ministers To Get Same Respect : మాజీలైపోయినా మంత్రుల్లాంటి గౌరవమే.! అదెలా సాధ్యం.?

Ex Ministers To Get Same Respect

Ex Ministers To Get Same Respect :  24 మంత్రులు రాజీనామా చేశారు. వాళ్ళంతా మాజీ మంత్రులైపోయారు. అయితే, అందులో కొందరిని తిరిగి మంత్రులుగా నియమించనున్నారట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వాళ్ళెవరన్నదానిపై స్పష్టత లేదు. అయితే, మంత్రి పదవులు కోల్పోయినవారి గౌరవం ఏమాత్రం తగ్గకుండా వారికి ప్రత్యేకమైన గౌరవం ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారట.

క్యాబినెట్ ర్యాంకుతో మాజీ మంత్రులకు ప్రత్యేక పదవులు ఇస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనా.? అసలు ఇది సాధ్యమవుతుందా.? అంటే, కొందరికి ఆ అవకాశం వుండొచ్చు. కానీ, రాజీనామా చేసిన మంత్రులందరికీ క్యాబినెట్ ర్యాంక్ పదవులంటే అది సాధ్యం కాకపోవచ్చు.

నిజానికి, ఇది జనంలోకి తప్పుడు సంకేతాల్ని పంపుతుంది. సో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత బాధ్యతాయుతంగా, అత్యంత హుందాగా ఈ విషయంలో వ్యవహరించాల్సి వుంటుంది. ఎలాగూ 2024 ఎన్నికల్లో గెలిచి మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధీమా వుంది గనుక, అప్పటి వరకు మాజీ మంత్రుల్ని, అదనపు అధికారాలతో సత్కరించాల్సిన అవసరమైతే లేదు.

ఒకవేళ, మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజమైతే గనుక, 2024 ఎన్నికల్లో వైసీపీ విజయావకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఎందుకంటే, అధికారం ప్రజలిచ్చింది తమకు మెరుగైన పాలన అందించమని.. అంతే తప్ప, నచ్చినవారికి నచ్చినట్టు పదవులు ఇచ్చుకోవడానికి కాదని జనంలోనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.