విజేత వైకాపా అయినా..పాల‌న టీడీపీదీ లా ఉంది!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు ఇచ్చి మీరే మా నాయ‌కుడు అంటూ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని పీఠ‌మెక్కించారు. వైకాపా 151 సీట్లు గెలుచుకుందంటే? ప‌్ర‌జ‌లు ఆ పార్టీ ప‌ట్ల ఎంత విశ్వాసంతో ఉన్నారో? అర్ధ‌మైంది. ఇది రాజ‌కీయాల‌లోనే ఓ చ‌రిత్ర‌. ప్ర‌తిప‌క్షం ఎంత బ‌లంగా ఉన్నా ప్ర‌జ‌ల తీర్పును తూచ త‌ప్ప‌కుండా స్వాగితించాల్సిందే. ప్ర‌తిప‌త‌క్ష నేత‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూడా ప్ర‌జ‌ల తీర్పును స్వాగతించారు. ఎట్ట‌కేల‌కు ఒక్క ఛాన్స్ అంటూ జ‌గ‌న్ ని ప్ర‌జ‌లు సీఎం చేసార‌ని త‌న అస‌హ‌నాన్ని వీలున్న‌ప్పుడ‌ల్లా వెళ్ల‌గ‌క్కిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు అనుకోండి.

అయితే జ‌గ‌న్ ఏడాది పాల‌న‌పై రాజ‌కీయ‌ నిపుణులు, ప్ర‌తిప‌క్ష పార్టీలు, విశ్లేష‌కులు ఎవ‌రి అభిప్రాయాలు వాళ్లు పంచుకున్నారు. జ‌గ‌న్ మంచి కార్య‌క్ర‌మాలు చేసార‌ని కొంద‌రంటే? రాష్ర్టాన్ని దోచుకుంటున్నార‌ని మరికొంద‌రు…రౌడీల రాజ్యం సుభిక్షంగా ఉండేది ఎప్పుడంటూ ఇంకొన్ని పార్టీలు ఎవ‌రి ఇష్టాను సారం అభిప్రాయాలు చెబుతూనే దుయ్య‌బెట్టే ప్ర‌య‌త్నం చేసారు. కాసేపు ఆవిష‌యాల‌న్నీ ప‌క్క‌న బెట్టి కాస్త లోతుగా ఆలోచిస్తే అస‌లు రాష్ర్టాన్ని పాలిస్తుంది జ‌గ‌నా? చ‌ంద్ర‌బాబు నాయుడా? అన్న అనుమానం రేకెత్తుతోంది. ఎందుకంటే 151 సీట్లున్నా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తాను ప్ర‌ధానంగా అనుకున్న‌ది ఏదీ చేయ‌లేక‌పోతున్నారు.

అధికారంలో ఉన్న జ‌గ‌న్ పూర్తి స్థాయిలో స్వేచ్ఛ‌గా రూల్ చేయ‌లేక‌పోతున్నారు? అనే అనుమానం క‌ల్గుతోంది. ప్ర‌తిప‌క్షాల వ్యూహాల‌ను తిప్పి కొట్ట‌డంలో జ‌గ‌న్ ప్ర‌తి సారి ఫెయిల‌వుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. భ‌వ‌న నిర్మాణ‌న కార్మికుల ద‌గ్గ‌ర నుంచి…మూడు రాజ‌ధానుల అంశం..ప్ర‌స్తుతం ఏపీలో చోటు చేసుకుంటోన్న తాజా ప‌రిస్థితులు..హైకోర్టు మొట్టికాయ‌లు ఇలా ప్ర‌తీ విష‌యంలో జ‌గ‌న్ ఫెయిల్యూర్ గానే క‌నిపిస్తున్నారు. జ‌గ‌న్ అనుకున్న‌ది ఏదీ ఆయ‌న చేయ‌లేక‌పోతున్నారు…కానీ చంద్ర‌బాబు అనుకున్న‌ది ప్ర‌తీది జ‌రుగుతోంది. చ‌ట్టాలు లో ఉన్న లొసుగులు వాడుకుని చంద్ర‌బాబు జ‌గ‌న్ చేసే ప్ర‌తీ కార్య‌క్ర‌మానికి అడ్డు త‌గులుతున్నారు. రాష్ర్టంలో తాను అనుకున్న‌దే జ‌ర‌గడం అంతే ఆస‌క్తిక‌రం. చెప్పుకోవ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అని త‌ప్ప‌! రూలింగ్ అంతా చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న‌ట్లే ఉంది.