ఆ కొరియోగ్రఫీ చూసి ఏడ్చేసా… షూటింగ్లో మాత్రం డాన్స్ బ్లాస్ట్ అయింది: విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కాగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమాను వచ్చే నెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున సినిమాకి సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ అనే పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇక ఈ పాటలో విజయ్ దేవరకొండ మాస్ స్టెప్పులతో రెచ్చిపోయి డాన్స్ చేశారని చెప్పాలి. ఇకపోతే విజయ్ దేవరకొండ నటన పరంగా ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ ఈయనకు పెద్దగా డాన్స్ రాదని చెప్పాలి. అందుకే విజయ్ దేవరకొండ సినిమాలలో పెద్దగా స్టెప్పులు ఉండవు.

అయితే లైగర్ సినిమాలో మాత్రం ఈ పాటలో విజయ్ దేవరకొండ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినట్టు తెలుస్తుంది.ఇకపోతే ఈ డాన్స్ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తనకు ఈ పాటకు కొరియోగ్రఫీ చూసినప్పుడు ఏడుపొచ్చింది. అయితే ఎంతో కష్టపడి ఈ పాటకు డాన్స్ చేస్తానని షూటింగ్ తర్వాత ఈ పాటకు చేసిన పర్ఫామెన్స్ బ్లాస్ట్ అయిందని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది.