తాజాగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలు వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణలో సరైన పరిపాలన అందించలేని ఆయన.. ఏం సాధించాలని దేశవ్యాప్తపర్యటనకు వెళ్లాడు అని ప్రశ్నించాడు. ప్రజల సొమ్ముతో ప్రత్యేకంగా విమానాన్ని ఏర్పాటు చేసుకొని తిరగడానికి వెళ్లిన ఆయనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నాడు.
అంతేకాకుండా గూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తా అన్నట్లుగా ఆయన తీరు ఉందని వెటకారం చేశాడు. ఇక ఆయనకు గుణపాఠం చెప్పక పోతే తెలంగాణకే అరిష్టమని అన్నాడు. తెలంగాణలో పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయని.. ఉద్యోగస్తులకు సరైన జీతాలు ఇవ్వడం లేదు అని.. మధ్యాహ్నం భోజనం ఉండేవారికి బిల్లులు చెల్లించడం లేదు అని.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అని మండి పడ్డాడు. అంతేకాకుండా లిక్కర్ రేటుతో పాటు భూముల రిజిస్ట్రేషన్, కరెంటు, బస్సు చార్జీలు పెంచాడని వ్యాఖ్యలు చేశాడు.