Hardik Pandya: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు అలాగే క్రికెటర్స్ కి లక్షలాది మంది అభిమానులు ఉంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.అలాగే సినిమా సెలబ్రిటీలకు, క్రికెటర్స్ మధ్య మంచి అనుబంధం ఉంటుంది. చాలామంది సెలబ్రిటీలకు అలాగే క్రికెటర్స్ కి మ్యారేజ్ అయిన విషయం కూడా తెలిసిందే. ఉదాహరణకు విరాట్ కోహ్లీ అనుష్క శర్మను తీసుకోవచ్చు. గతంలో కూడా చాలామంది క్రికెటర్స్ కి హీరోయిన్లకు మధ్య ఏదో నడుస్తోంది అంటూ చాలా రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అందులో కొన్ని నిజం కాగా మరి కొన్ని రూమర్స్ గానే మిగిలిపోయాయి.
అయితే గత కొద్ది రోజులుగా క్రికెటర్ హార్దిక్ పాండ్యా పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు ఒక బాలీవుడ్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ రూమర్స్ పై సదరు హీరోయిన్ స్పందించింది. అసలం జరిగిందో క్లారిటీగా వివరరన కూడా ఇచ్చింది. ఆమె మరెవరో కాదు.. ఈషా గుప్తా. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ముద్దుగుమ్మ.
ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఆమె పేరు హార్దిక్ పాండ్యా పేరుతో ముడిపడి ఉంది. అయితే హార్థిక్ పాండ్యాతో ప్రేమ డేటింగ్ అంటూ వస్తున్న వార్తలపై ఈషా గుప్తా స్పందిస్తూ.. కొన్నినెలల పాటు మేమిద్దరం మాట్లాడుకున్నాము. మా మధ్య స్నేహం ఏర్పడింది. మేం డేటింగ్ లో ఉన్నామని అనుకోవట్లేదు. మేం మాట్లాడుకోవడం మొదలు పెట్టినప్పుడు డేటింగ్ లోకి వెళ్లే ఛాన్స్ ఉండవచ్చు.. ఉండకపోవచ్చని ముందే ఫిక్స్ అయ్యాము. కానీ రిలేషన్ లోకి అడుగుపెట్టకుండానే విడిపోయాము. రెండు, మూడు సార్లు కలిసి ఉంటాము. కానీ కొన్ని నెలలపాటు మా రిలేషన్ కొనసాగింది. తర్వాత అది ముగిసిపోయింది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈషా గుప్తా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.