Dhanush-Mrunal: ప్రస్తుతం సోషల్ మీడియాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ లకు సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో తరచుగా వీళ్లిద్దరూ కలిసి కనిపించడం, ఈవెంట్ లకు వెళ్తుండడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఎలాగో ధనుష్ తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకుని విడిపోయారు.
ప్రస్తుతం హీరో ధనుష్ సింగిల్ గానే ఉంటున్నారు. దాంతో ఈ వార్తలు బాగా ఊపందుకున్నాయి. ఇలాంటి సమయంలోనే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ అనుమానాలు మరింత బలం అవుతున్నాయి. ఇంతకీ ఆ వీడియో ఏంటి అన్న విషయానికి వస్తే..ధనుష్ సోదరీమణులు కార్తిక, విమల గీతను మృణాల్ కలిసినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరినీ సోషల్ మీడియాలో మృణాల్ ఫాలో అవుతున్నారు.
https://twitter.com/Pokeamole_/status/1951919613706379454?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1951919613706379454%7Ctwgr%5Ed47ce32a9be07c80ccb830589f8e82e1d83ea9c0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-4159229700208735093.ampproject.net%2F2507172035000%2Fframe.html
వాళ్లు కూడా ఇటీవలే ఈ బ్యూటీ ఫాలోవర్స్ లిస్ట్‌లో చేరారు. దీంతో మృణాల్‌ను ధనుష్ తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశారని కూడా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకూ నటీనటులిద్దరూ స్పందించకపోవడం గమనార్హం. తాజాగా ధనుష్ మృణాల్ ఠాకూర్ ఇద్దరు ధనుష్ కుటుంబంతో కలిసి కనిపించడంతో వారి డేటింగ్ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయ్యింది. అయితే నిజంగానే ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారా? సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజమేనా కాదా అన్నది తెలియాలి అంటే వీరిద్దరూ స్పందించే వరకు ఉంచి చూడాల్సిందే మరి.
