‎Mrunal Thakur: హమ్మయ్య.. ఎట్టకేలకు ధనుష్ తో డేటింగ్ వార్తలపై స్పందించిన మృణాల్ ఠాకుర్!

‎Mrunal Thakur: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు నటీనటులు కాస్త చనువుగా కనిపించారు అంటే చాలు వారి మధ్య ఏదో నడుస్తోంది డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. కొంతమంది అలాంటి వార్తలను చూసి చూడనట్టుగా వదిలేస్తే మరి కొంతమంది మాత్రం అలాంటి వార్తలపై గట్టిగానే స్పందిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అయితే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న వార్త ధనుష్ అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకుర్ డేటింగ్ లో ఉన్నారు అని.

‎ దానికి తగ్గట్టుగా ఒక రెండు మూడు వీడియోలలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఆ వార్తలకు మరింత ఆద్యం చేకూర్చినట్టు అయింది. అయితే ఈ డేటింగ్ పుకార్లకు బలం చేకూర్చేలా కొన్ని విషయాలు కనిపించాయి. ధనుష్ ప్రస్తుతం భార్య నుంచి ఐశ్వర్య నుంచి విడాకులు తీసుకుని సింగిల్‌ గానే ఉంటున్నారు. మృణాల్ రీసెంట్‌గా జరిగిన సన్‌ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్‪‌ లో ధనుష్‌ తో చనువుగా కనిపించడం, అలానే ధనుష్ అక్కలు ఇద్దర్ని ఇన్ స్టాలో మృణాల్ ఫాలో అవుతుండటం లాంటివి చూసి డేటింగ్ నిజమని అందరూ భావించారు.

‎ఈ వార్త రోజురోజుకీ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుండడంతో ఎట్టకేలకు ఈ వార్తలపై తాజాగా మృణాల్ ఠాకుర్ స్పందించింది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. ధనుష్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. ఈ రూమర్స్ గురించి నాకు కూడా తెలుసు. నిజం చెప్పాలంటే అవి చాలా ఫన్నీగా అనిపించాయి. సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ ఈవెంట్‌ కి ఆయన రావడాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ధనుష్, అజయ్ దేవగణ్ క్లోజ్ ఫ్రెండ్స్. అజయ్ పిలిస్తేనే ధనుష్ ఆ ఈవెంట్ కి వచ్చాడు. మేము ఇద్దరం కలిసి కనిపించినంత మాత్రాన మా మధ్య ఏదో జరుగుతున్నట్లు కాదు అని మృణాల్ చెప్పుకొచ్చింది. దీంతో ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు వారిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది.