Selfie: సెల్ఫీ కోసం రైలు మీదకు ఎక్కి ప్రాణాల మీదకి తెచ్చుకున్న యువకుడు..!

Selfie: ప్రస్తుతం చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ కి బాగ అలవాటు పడిపోయారు. స్మార్ట్ ఫోన్ లో ఉండే కొత్త కొత్త ఫీచర్స్ అందరిని బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం చాలామంది సెల్ఫీలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటం బాగా అలవాటైపోయింది. సమయం సందర్భం అంటూ లేకుండా ఉత్తినే సెల్ఫీలు తీసుకోవటం అందరికీ బాగా అలవాటైపోయింది. కానీ ఇక్కడ ఇలాంటి సెల్ఫీ పిచ్చి వల్ల ఒక యువకుడు ప్రాణం గాలిలో కలిసిపోయింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

పిడుగురాళ్ల పట్టణం రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన కటికం వీరబ్రహ్మం అనే వ్యక్తి రైల్వే స్టేషన్ సమీపంలో నివసించేవాడు. బుధవారం వీరబ్రహ్మం తన బైక్ పై రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. అప్పటికే పట్టాల మీద గూడ్స్ రైలు ఆగి ఉండటంతో వెనుక భోగి పైకి ఎక్కాడు.

రైలు బోగి పైకి ఎక్కిన వీర బ్రహ్మం పైన ఉన్న హై టెన్షన్ విద్యుత్ వైర్లు ఉండటం గమనించకుండా సెల్ఫీ తీసుకొని ఎందుకు చేయి పైకెత్తాడు. వెంటనే విద్యుత్ వైర్లు తగిలి కింద పడడం వల్ల తలకు బాగా దెబ్బ తగిలింది. తలకు దెబ్బ తగలడం మాత్రమే కాకుండా విద్యుదాఘాతానికి శరీరం కూడా మంటలలో తగలబడుతున్న వీరబ్రహ్మం నీ చూసిన సుబ్బయ్య అనే యువకుడు గమనించి వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు.

రైల్వే మాస్టర్ కృపాకర్, రైల్వే ఎస్ ఐ పోలయ్య,ఏ ఎస్ ఐ క్రీస్తు దాసు, కానిస్టేబుల్ సురేష్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వీరబ్రహ్మం ను 108లో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.