అసలు చికెన్ తింటే మంచిదా? తినకుంటే మంచిదా? తిన్నా ఎంత తినాలి? ఎక్కువ తింటే మంచిదేనా? కరోనా సమయంలో చికెన్ తినాలంటూ డాక్టర్లు కూడా సూచిస్తున్నారు? మరి.. రోజూ ఎంత చికెన్ తినాలి? నిజంగానే చికెన్ తింటే కరోనా రాదా? ఇలాంటి వంద డౌట్లు వస్తున్నాయి జనాలకు. అసలు చికెన్ తింటే లాభమా? నష్టమా? తెలుసుకుందాం రండి..
నిజానికి చికెన్ లో చాలా ప్రొటీన్లు ఉంటాయి. దానిలోని ప్రొటీన్స్ వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల కరోనా వైరస్ రాకుండా శరీరం అడ్డుకుంటుంది.
అలా అని చెప్పి అతిగా చికెన్ తింటే కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్టే. ఎందుకంటే.. చికెన్ అతిగా తింటే విపరీతంగా బరువు పెరుగుతారు. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. శరీరానికి ప్రొటీన్స్ ఎక్కువైతే.. ఆ ప్రొటీన్స్ కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. దీంతో విపరీతంగా బరువు పెరుగుతారు.
అందుకే మీరు తినే ఆహారంలో 20 శాతానికి మించి చికెన్ తినకూడదు. తింటే బరువు పెరిగినట్టే. అయితే.. బరువు పెరగడం అనేది పక్కన పెడితే.. చికెన్ ఎక్కువగా తింటే… కండరాలు పెరుగుతాయి. బలహీనంగా ఉన్నవాళ్లు చికెన్ ఎక్కువగా తింటే బలంగా తయారవుతారు. మజిల్ పవర్ పెరుగుతుంది.
చాలామంది ఎక్కువగా ప్రాసెస్ చేసిన చికెన్ ను తింటుంటారు. దాని వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. వారానికి రెండు సార్లు ప్రాసెస్ చేసిన చికెన్ తిన్నా… 3 నుంచి 7 శాతం వరకు ఎక్కువగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
చికెన్ లో ప్రొటీన్స్, కేలరీలే ఎక్కువగా ఉండటం వల్ల.. అతిగా చికెన్ తినే వాళ్లకు మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ చికెన్ ఎక్కువగా తింటే.. ఫైబర్ కూడా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.