అమెజాన్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఈకామర్స్ కంపెనీ. ఆ కంపెనీలో జాబ్ దొరకడమంటే అంత వీజీ కాదు. కానీ.. లాక్ డౌన్ సమయంలో కూడా 20 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఆ 20 వేల మందిలో మీరు కూడా ఒకరు కావచ్చు.
దాని కోసం మీరు ఫుల్ టైమ్ జాబ్ చేయాల్సిన పనిలేదు. ఇంటర్వ్యూలు గట్రా ఉండవు. పార్ట్ టైమ్ గా.. మీ ఊళ్లోనే.. మీ ఇంటి వద్ద నుంచి కూడా ఉద్యోగం పొందే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తుంది. కేవలం రోజుకు 4 గంటలు కష్టపడ్డా చాలు.. నెలకు 70 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.
దాని కోసం అమెజాన్ డెలివరీ బాయ్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది. డెలివరీ బాయ్ అనగానే చాలామంది తిరుగుడు ఎక్కువగా ఉంటుంది.. అని అనుకుంటారు కానీ.. డెలివరీ బాయ్ గా చేస్తూ.. నెలకు 70 వేల వరకు సంపాదించే అరుదైన అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం అమెజాన్ సేవలు చిన్న చిన్న పట్టణాల్లోనూ విస్తరించాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా.. అక్కడే ఉద్యోగం పొందొచ్చు. దానికోసం logistics.amazon.in/applynow వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయి చేసుకుంటే చాలు.
మీ ప్రాంతంలోనే రోజుకు కనీసం 100 ప్యాకేజీలను డెలివరీ చేసినా చాలు.. కనీసం 70 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.
కనీసం టెన్త్ చదివినా చాలు.. డెలివరీ బాయ్ ఉద్యోగాన్ని పొందొచ్చు. కాకపోతే ప్యాకేజీలు డెలివరీ చేయడానికి సొంతంగా బైక్ ఉండాలి.
సాధారణంగా డెలివరీ బాయ్స్ కు నెలకు సంస్థ నుంచి 12 వేల నుంచి 15 వేల వరకు జీతం వస్తుంది. దానితో పాటు.. ప్రతి ప్యాకేజీ డెలివరీకి అదనంగా 15 నుంచి 20 రూపాయలు లభిస్తాయి.