‎Balakrishna: బాలయ్య ట్రాక్ రికార్డు మాములుగా లేదుగా.. ఇంటా బయటా ఊపు ఊపేస్తున్నాడుగా!

‎‎Balakrishna: టాలీవుడ్ అగ్ర హీరో, నందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సినిమాలలో నటించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు బాలయ్య బాబు. ఆయన నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు తిరగరాసాయి. ముఖ్యంగా ఆయన చెప్పే మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తూ ఉంటాయి. ఇప్పటికీ అదే ఊపుతో వరుసగా సినీమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు బాలయ్య బాబు.

‎ ఇకపోతే ప్రస్తుతం బాలయ్య బాబు అఖండ 2 సినిమాలో నటిస్తున్నారు. గతంలో విడుదల అయినా అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా బాలయ్య బాబుకి సంబంధించిన ఒక వార్త సోషల్ శుభాకాంక్షల వెల్లువెత్తుతున్నాయి.‎‎

రాజకీయ అలాగే సినిమా వర్గాల నుంచి అభినందనలు దక్కుతున్నాయి. దశాబ్దంన్నరకు పైగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మెన్ గా సేవలు అందించడంతో పాటుగా హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపొంది, సామాజికంగా సినిమాల పరంగా ఎంతో సేవ చేసినందుకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేశారు. అయితే గత మూడేళ్లుగా బాలయ్య ట్రాక్ రికార్డు ఇంటా బయటా మాములుగా లేదని చెప్పాలి. అఖండ ముందు ఉన్న మార్కెట్ కి ఇప్పుడు చూస్తున్న ఎక్స్ ప్రెస్ స్పీడ్ కి పొంతన లేదని చెప్పవచ్చు. సినిమాల పరంగా చూసుకున్న కూడా అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ లాంటి వరస మూవీస్ తో బ్లాక్ బస్టర్లతో ఒక్కసారిగా వేగం పెంచేసారు బాలయ్య.