Samantha: సినీ నటి సమంత ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయి ఈ వెబ్ సిరీస్ లో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈమె వెండితెర పై ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది. తెలుగులో అయితే చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా తర్వాత వెండితెరకు పూర్తిగా దూరంగా ఉన్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె తన వ్యక్తిగత కారణాలవల్ల ఇబ్బందులకు గురి అయ్యారు అదే సమయంలోనే మయోసైటిసిస్ వ్యాధికి గురి కావడంతో సమంత పూర్తిగా సినిమాలకు విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఇలా కాస్త గ్యాప్ తీసుకున్న ఈమె తిరిగి వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక సమంత మయోసైటిస్ వ్యాధికి గురి అయినప్పుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను అంటూ పలు సందర్భాలలో తెలియచేసారు.
ఆ సమయం తనకు ఎంతో కష్టంగా గడిచిందని సమంత తెలిపారు. అయితే అలాంటి సమయంలో తనకు ఓ వ్యక్తి అండగా నిలిచారని ఆయన కారణంగానే నేను కాస్త కోలుకొని బయటపడ్డాను అంటూ సమంత తెలియజేశారు. మరి సమంతను ఓదార్చిన ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయానికోస్తే ఆయన మరెవరో కాదు సమంత స్నేహితుడు రాహుల్ రవీందర్ అని చెప్పాలి.
నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రాహుల్ రవీందర్ సింగర్ చిన్మయి ని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక చిన్మయి సమంత సినిమాలకు డబ్బింగ్ చెబుతూ ఉండేవారు .ఇలా వీరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఏర్పడింది. ఇక సమంత కష్ట సమయాలలో రాహుల్ రవీందర్ ప్రతిరోజు సమంత వద్దకు వెళ్లి కొంత సమయం తన వద్ద గడుపుతూ తనతో మాట్లాడుతూ ఉండేవారట.
తనకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పటికీ నాకంటూ కొంత సమయం కేటాయించి రాహుల్ నా వద్దకు వచ్చి జోక్స్ వేస్తూ నన్ను నవ్వించేవారు. ఇక నా పనులు కూడా ఆయనే చేసి పెట్టేవారు. అలా కష్ట సమయంలో రాహుల్ నాకు ఎంతో అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యం చెప్పారు. నా జీవితాంతం అలాంటి ఒక గొప్ప స్నేహితుడిని వదులుకోను అంటూ సమంత ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరూ కలిసి యు టర్న్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.