దుబ్బాక తెరాస అభ్యర్థి ఖరారు.. భగ్గుమన్న అసమ్మతి

kcr dubbaka telugu rajyam

  తెలంగాణ లోని దుబ్బాక ఉప ఎన్నికల పోరు లో దాదాపు అన్ని పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది తేలిపోయింది. ముందుగా బీజేపీ పార్టీ నుండి రఘునందన్ రావు ఖరారు అయ్యాడు. తర్వాత కాంగ్రెస్ నుండి సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరును మాత్రమే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పార్టీ హై కమాండ్ కు పంపినట్లు తెలుస్తుంది. పంపింది ఒకరి పేరే కాబట్టి ఆయన్నే ఖరారు చేసే అవకాశం వుంది. ఇక తెరాస లో ఆ పార్టీ దివంగత నేత సోలిపేట రామలింగా రెడ్డి సుజాత పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశాడు.

Sujathe dubbaka telugu rajyam

 

  సోలిపేట రామలింగా రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి. అదే విధంగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కి కూడా చివరి శ్వాస వరకు కష్టపడి పనిచేశాడు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలతో ఆ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని అందుకే రామలింగ రెడ్డి భార్య సుజాతకే టిక్కెట్ ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించాడు. ఎప్పుడైతే ఆమె పేరును ఖరారు చేశారని తెలిసిందో, దుబ్బాకలో తెరాస లో వర్గ పోరు బయట పడింది. స్థానికంగా కీలక నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి తిరుగుబావుటా జెండా ఎగురవేశాడు. తెరాస పార్టీలో చేరకముందే కేసీఆర్ తనుకు హామీ ఇచ్చాడని, కానీ ఇప్పుడు మాట మార్చారని శ్రీనివాస్ రెడ్డి విమర్శలు చేస్తున్నాడు.

  అదే సమయంలో కాంగ్రెస్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహతో మంతనాలు సాగిస్తూ కాంగ్రెస్ లోకి రావటానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నర్సారెడ్డి కి టిక్కెట్ ఖరారు చేసిన నేపథ్యంలో శ్రీనివాసు రెడ్డి ఎంట్రీ ఇస్తే పరిస్థితి మారిపోతుంది. గతంలో శ్రీనివాసు రెడ్డి తండ్రి చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్ లోనే కీలక నేతగా పనిచేసి ఉండటంతో కాంగ్రెస్ నాయకత్వం శ్రీనివాసు రెడ్డి మీద కొంచం సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తుంది. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే కచ్చితంగా నర్సారెడ్డి ని టిక్కెట్ విషయంలో బుజ్జగించి అతన్ని తప్పించి శ్రీనివాస్ రెడ్డి కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు లేదా రేపు దీనిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.