తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుబ్బాక ఉప పోరు లో ప్రధాన పార్టీలన్నీ నువ్వా – నేనా అన్నట్లు పోటీపడ్డాయి. తెరాస నుండి దివంగత నేత సోలిపేట రామలింగ రెడ్డి భార్య సుజాత, బీజేపీ నుండి రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ నుండి చెరుకు శ్రీనివాస్ పోటీచేశారు. దీనికి సంబంధించిన ఎన్నికల ఫలితాల ఈ రోజు వెల్లడికానున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ పక్రియ సిద్దిపేట లోని ఇందూరు కళాశాలలో మొదలైంది.
తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు, మొదటి రౌండ్ లో తెరాస పార్టీ వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో వున్నారు, తెరాస అభ్యర్థి మీద 341 ఓట్లు ఆధిక్యం సాధించాడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. మొదటి రౌండ్ లో బీజేపీ కి 3208 ఓట్లు ,తెరాస కు 2867 ఓట్లు ,కాంగ్రెస్ కు 648 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కింపు జరగనుంది. 23 మంది అభ్యర్థులు పోటీపడుతున్న ఈ ఎన్నికల్లో మరి కాసేపటిలో విజేత ఎవరో సృష్టం కానుంది.
కరోనా నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకోని కౌంటింగ్ పక్రియ చేపట్టారు. మొత్తం 23 రౌండ్స్ లో లెక్కింపు జరుగుతుంది. అలాగే 5 వీవీ ఫ్యాట్లు లోని ఓట్లు లెక్కింపు కూడా చేప్పట్టే అవకాశం ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలు ఈ నెల 3 వ తేదీన జరిగాయి. ఇందులో 1,64,192 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోనే తొలిసారిగా 82.61 శాతం పోలింగ్ జరగటం విశేషం. ఇక మొన్న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో విజయావకాశాలు అటు తెరాస కు ఇటు బీజేపీ కి సమానంగా ఉన్నాయని వెల్లడించారు. మెజారిటీ మాత్రం తెరాస విజయం సాధించవచ్చని, అయితే ఓట్లు శాతం పెద్దగా తేడా ఉండకపోవచ్చని పేర్కొన్నాయి, కానీ పోస్టల్ బ్యాలెట్స్ లో మాత్రం ఫలితాలు బీజేపీ కి అనుకూలంగా రావటంతో తెరాస శ్రేణుల్లో ఆందోళన, బీజేపీ శ్రేణుల్లో ఉత్సహం కనిపిస్తున్నాయి…