తెలంగాణలోని దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చయి. రానున్న రోజుల్లో బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందనే సంకేతాన్ని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. తమకు ఎదురేలేదన్నట్టు వ్యవహరిస్తున్న కేసీఆర్ బీజేపీ రూపంలో దుబ్బాక ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారు. అయితే ఈ దుబ్బాక ఫలితాలు ఇప్పుడు జనసేన నూతన ఆశలను, ఉత్సహాన్ని పుట్టిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తరువాత పవన్ ను చాలామంది విమర్శించారు. దేశంలో మోడీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ పొత్తు అవసరమా అని పవన్ ను ప్రశ్నించారు కానీ ఇప్పుడు దుబ్బాక ఫలితాలను చూసిన ప్రజలు పవన్ కళ్యాణ్ నిర్ణయం సరైనదని అంటున్నారు.
జనసేనతో కొత్త ఆశలు, ఉత్సహం
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు, బీహార్ ఎన్నికల ఫలితాలు జనసేనలో, పవన్ కళ్యాణ్ లో, జనసేన కార్యకర్తల్లో నూతన ఉత్సహాన్ని ఇచ్చాయి. గత కొంత కాలం నుండి బీజేపీ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పవన్ కళ్యాణ్ సంతోషంగా లేరని, పొత్తును క్యాన్సల్ చేసుకునే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారని వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు దుబ్బాక, బీహార్ ఎన్నికల ఫలితాలను చూసిన పవన్ మాత్రం బీజేపీతొ కలిసి రానున్న రోజుల్లో వైసీపీని అడ్డుకోవడానికి వ్యూహాలను రచిస్తున్నారని సమాచారం. ఇప్పటికే బీజేపీ పెద్దలను కూడా పవన్ కలిశారని కూడా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఏపీలో కూడా బీజేపీ ఎదగగలదా!!
దుబ్బాక ఎన్నికల తరువాత బీజేపీలో నూతన ఉత్సహం మొదలయ్యింది. ఈ ఉత్సహంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఏపీలో మాత్రం ఇప్పటి వరకు బీజేపీ నాయకులు తమ ప్రభావాన్ని ఎన్నికల్లో చూపించలేకపోయారు. అలాగే ఇక్కడ ఉన్న టీడీపీ, వైసీపీల పోరును తట్టుకొని బీజేపీ నాయకులు నిలబడుతారో లేదో వేచి చూడాలి. దుబ్బాక ఎన్నికల్లో ప్రజా సమస్యల గురించి మాట్లాడటం వల్లే బీజేపీ గెలిచిందని, అలాగే ఇప్పటి నుండి ఏపీలో కూడా మతం, కులం పేరిట కాకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే రానున్న రోజుల్లో ఏపీలో కూడా బీజేపీ సత్తా చాటగలదు.