బుల్లితెరకు దూరమై సమాజసేవలో డాక్టర్ బాబు?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా గుర్తింపు పొందిన నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చంద్రముఖి, తోడికోడళ్ళు వంటి సీరియల్స్ లో నటించినప్పటికీ.. కార్తీకదీపం సీరియల్ ద్వారా నిరుపమ్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే గత కొంతకాలంగా కార్తీక దీపం సీరియల్ లో నిరుపమ్ కనిపించటం లేదు. ఆ సీరియల్ లో హిమ ,శౌర్య క్యారెక్టర్లు పెద్దవాళ్ళు కావటంతో దీప, కార్తీక్, మోనిత ఈ సీరియల్ లో కనిపించటం లేదు.

అయినా కూడా నిరుపమ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు దగ్గరగా ఉన్నాడు. మంజుల నిరుపమ్ అనే సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా తన భార్యతో కలిసి వీడియోలు చేస్తూ ప్రేక్షకులకి చేరువలో ఉన్నాడు. ఇలా కార్తీకదీపం సీరియల్ ద్వారా ఫేమస్ అయిన నిరుపమ్ ఈ సీరియల్ ద్వారా భారీ మొత్తంలో ఆస్తులు కూడపెట్టుకున్నాడు. కార్తీక దీపం సీరియల్ ఒక్క ఎపిసోడ్ కి దాదాపు 22 వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇలా సీరియల్స్ ద్వార సంపాదించిన డబ్బులో కొంత సమాజసేవ చేయటానికి ఉపయోగిస్తున్నాడు.

ఇటీవల నిరుపమ్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల నిరుపమ్ స్లమ్ ఏరియాలో తినటానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న వారికి తినడానికి తినే పదార్థాలను అందించాడు. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారితో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ వారికి కావాల్సిన సహాయాన్ని అడిగి తెలుసుకుంటున్నాడు. ఇలా నిరుపమ్ సమాజసేవ చేస్తూ ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. నిరుపమ్ చేస్తున్న మంచి పని గురించి తెలుసుకున్న నెటిజన్స్ మీలాంటి వాళ్లు సమాజంలో కచ్చితంగా ఉండాలి అని కామెంట్లు పెడుతున్నారు.