Omicron Variant: ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అంశం కరోనా ఎప్పుడు పోతుందా అని. దాదాపుగా తగ్గిపోయింది, ఇక కేసులు తగ్గిపోయాయి అనే టైం లో ఏదో ఒక వేరియంట్ రూపంలో దాడి చేస్తోంది. కరోనా వైరస్ ఇప్పట్లో అంతం అవ్వదు అని WHO కూడా హెచ్చరిస్తోంది. దీని వ్యాప్తి ని అరికట్టడానికి ఉన్న ఆయుధాలు మాస్క్ లు ఉపయోగించడం, భౌతికదూరం పాటించడం, సానిటైజర్ వాడటం. అయితే ప్రతి వేరియంట్ పీక్ స్టేజ్ లో ఉన్నపుడు అందరూ ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎప్పుడైతే కేసులు కొంచెం తగ్గుముఖం పట్టినవెంటనే ఇక కరోనా రాదు అన్న ధీమా తో ఇష్టానుసారం వ్యవహరిస్తారు.
ఇప్పుడు వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ వల్లమరణాల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ జాగ్రత్తగానే ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రన్ వేరియంట్ చివరిది అని, కరోనా పీడ విరుగుడు అవుతుంది అనుకోవడానికి లేదట. ఈ వైరస్ కొత్త వేరియంట్ ల రూపంలో రూపాంతరం చెంది తిరిగి ఎప్పుడైనా దాడి చేస్తుంది. దీనిని అరికట్టడానికి మన చేతిలో ఉన్న ప్రాథమిక జాగ్రత్తలను పాటించడం ఎంతో ముఖ్యం అని WHO సూచిస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ ఇండియా లో థర్డ్ వేవ్ కి కారణం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది సామాజిక వ్యాప్తి దశలో ఉందని ఇండియన్ సార్స్- కోవ్ 2 జినోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్టియమ్ హెచ్చరిస్తోంది. కరోనా ప్రమాద స్థాయిలో ఉందని తెలిపింది. మన దేశంలో కొన్ని రోజుల నుండి రోజుకి 3 లక్షల పైగా కేసులు వస్తున్నాయి అంటే థర్డ్ వేవ్ ఏ దశ లో ఉందో తెలుసుకోవచ్చు. రానున్న 15 రోజుల్లో ఈ వ్యాప్తి తార స్థాయికి చేరుకుంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఫిబ్రవరి మూడోవారంలో థర్డ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని తియ్యటి కబురు చెప్పారు.
ఒమిక్రాన్ వేరియంట్ మొదటగా ఢిల్లీ మీద తర్వాత ముంబై మీద తన ప్రతాపం చూపించింది. ఇప్పుడు ఆయ నగరాల మీద కొంచెం ప్రభావం తగ్గి కేసులు తగ్గాయి. ఇప్పుడు ఈ వ్యాప్తి గ్రామీణ ప్రాంతాలకు విపరీతంగా వ్యాపిస్తోంది, ఇది ఆందోళన కలిగించే విషయం. ఇప్పుడు వస్తోన్న కేసులు అన్ని ఒమిక్రన్ వల్ల వచ్చేవే అని చెప్పడానికి లేదు, ఎందుకంటే సెకండ్ వేవ్ కు కారణం అయిన డెల్టా వేరియంట్ కేసులు కూడా దాదాపు గా 20% ఉన్నాయి. అంటే డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ రెండు కలిపి దాడి చేస్తున్నాయి. అయితే సెకండ్ వేవ్ లో కలిగిన కొన్ని ఇబ్బందుల నుండి దేశం త్వరగానే మేలుకుంది అని చెప్పవచ్చు. థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలు తీసుకొని, ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడ్డారు.
ఇప్పుడు చాలా మందిలో ఒక అపోహ ఉంది ఒమిక్రాన్ సోకితే నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుందని. అయితే ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రజలు ప్రాణాల మీద కి తెచ్చుకుంటున్నారు. 18 మ్యుటేషన్లు ఉన్న డెల్టా వేరియంట్ కంటే 50 మ్యుటేషన్లున్న ఒమిక్రాన్ 70 రెట్లు ఎక్కువ ప్రమాదకరం. ఒమిక్రాన్ సోకితే ప్రాణాపాయం ఉండదు అని గ్యారెంటీ ఏమి లేదు. కోవిడ్ నిబందలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండటం ఎంత అయిన అవసరం. దీనిని ఇలానే నిర్లక్షం చేస్తే డెల్టా వేరియంట్ చేసిన నష్టం పునరావృతం కావచ్చని హెచ్చరిస్తున్నారు. కరోనా ఎప్పుడు అంతం అవుతుంది అని ఎవరు కచ్చితంగా చెప్పలేని పరిస్తితి ఏర్పడింది. ఎవరి ప్రాణాలు, ఎవరి కుటుంబం వారికి చాలా ముఖ్యం కదా… ఇక నుండైనా కోవిడ్ నిబంధనలను నిర్లక్షం చేయకండి, జాగ్రత్తగా ఉండండి.