తెలుగు లో ఉన్న టాలెంటెడ్ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో సురేఖ వాణి ఒకరు. హేమ, సన ల తో పాటు పూర్తిగా సురేఖ వాణి చాలా సినిమాలు అక్క, వదిన పాత్రల్లో నటించారు. ‘దుబాయ్ శీను’, ‘సరైనోడు’, ‘శ్రీమంతుడు’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సురేఖ వాణి ఈ మధ్య సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. తన కూతురు తో ‘రీల్స్’ చేస్తూ ఇంకా ఫేమస్ అయ్యింది.
కొన్నాళ్ల క్రితం సురేఖ వాణి భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత కూతురితో ఎక్సపోసింగ్ చేయిస్తూ రీల్స్ చేస్తుందని చాలా మంది ట్రోల్ చేసారు. ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేఖావాణి తన రెండో పెళ్లి పై స్పందించారు.
నాకు ప్రస్తుతం రెండో పెళ్లిపై ఆసక్తి లేదని ఆమె కామెంట్లు చేశారు.కానీ నా కూతురు సుప్రీత మాత్రం నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని కోర్చుకుంటుందని, కానీ ప్రస్తుతం తనకు అలాంటి ఆలోచన లేదని అన్నారు.
పెళ్లి ఆలోచన లేనప్పటికీ… తనకు బాయ్ ఫ్రెండ్ కావాలని అనిపిస్తోందని సురేఖ వాణి చెప్పుకొచ్చారు.ఆ బాయ్ ఫ్రెండ్ నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి కావాలని, మంచి హైట్, పర్సనాలిటీ ఉన్న వ్యక్తి నాకు బాయ్ ఫ్రెండ్ గా కావాలని, అలాగే బాయ్ ఫ్రెండ్ అయ్యే వ్యక్తికి లైట్ గా గడ్డం ఉండాలని సురేఖ తెలిపారు.
ముఖ్యంగా నన్ను బాగా అర్థం చేసుకోవాలని ఆమె కామెంట్లు చేశారు.అలాంటి వ్యక్తి దొరకడంతో పాటు నాకు నచ్చితే అతనినే పెళ్లి చేసుకుంటానని ఆమె కామెంట్లు చేశారు. సురేఖావాణి చేసిన కామెంట్లను కొంతమంది నెటిజన్లు మెచ్చుకుంటుంటే మరి కొందరు నెటిజన్లు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తున్నారు.