కొత్తగా పెళ్ళైందా.. ఉదయాన్నే ఇలా చేస్తే మీ బంధం ఇంకా స్ట్రాంగ్ అవ్వడం ఖాయం!

పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న తర్వాత నవదంపతులు మొదట్లో ఒకరితో ఒకరు మాట్లాడడానికి, కలిసిపోవడానికి చాలా సమయం పడుతుంది. అదే లవ్ మ్యారేజ్ అయితే అప్పటికే వారి మధ్య బంధం ఉంటుంది కాబట్టి వారు పెళ్లి అయిన తరువాత చనువుగా ప్రేమగా ఉంటారు. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే అప్పటివరకూ పరిచయం లేని వ్యక్తి, ఆ వ్యక్తి తోనే అదే తొలి పరిచయం కావడంతో త్వరగా తెలుసుకోలేరు. అలాంటివారికి ఈ టిప్స్ ఉపయోగపడవచ్చు..

ఇందులో మొదటిది ఒకరిపై ఒకరు అవగాహన పెంచుకోవడం. అందుకోసం ఉదయం పూట కొన్ని పనులు చేస్తూ ఒకరికి ఒకరు దగ్గర కావచ్చు. అలాగే రాత్రి పడుకోవడానికి బెడ్రూమ్ లోకి వెళ్ళే ముందు ఆ దంపతులు ఎవరికివారుగా కాకుండా ఇద్దరూ ఒకేసారి వెళ్లడం వల్ల వారి మధ్య అనుబంధం బలపడుతుంది. అలాగే ఒకేసారి నిద్రలేవడం వల్ల శుభోదయం చెప్పుకోవడం, ఆలింగనం చేసుకొని ఆ తర్వాత వారి పనులు చేసుకోవడం లాంటివి చేయడం వల్ల వారి మధ్య బంధం బాగుంటుంది. నిద్ర లేవగానే హడావిడిగా వెళ్ళిపోకుండా.. ఒక ఐదు పది నిమిషాల పాటు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఇద్దరి మధ్య సాహిత్యం ఏర్పడుతుంది.

అలాగే దాంపత్యంలో అన్యోన్యత పెరగాలి అంటే ఇద్దరు కలిసి కాసేపు నవ్వుతూ జోక్స్ వేసుకోవాలి. ఒకవేళ ఆ దంపతులకు వ్యాయామం చేసే అలవాటు ఉంటే ఇద్దరూ కలిసి చేయడం వల్ల వారి మధ్య బంధం ఇంకా బలపడుతుంది అంటున్నారు నిపుణులు. అలాగే భాగస్వామి చేసిన కాఫీ, టిఫిన్, అల్పాహారాలు ఏదైనా రుచిగా ఉన్న, వేసుకున్న డ్రస్సు బాగున్నా కూడా చిన్న కాంప్లిమెంట్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి పొగడ్తల వల్ల ఇద్దరి మధ్య సాహిత్యం ఏర్పడటంతో పాటు, సెరటోనిన్ అని హ్యాపీ హార్మోన్ విడుదలయ్యేలా చేస్తాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడంవల్ల నవ దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.