Political Parties: భారతదేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అనేక రాజకీయ పార్టీలకు నిలయం. పదుల సంఖ్యలో ప్రధాన పార్టీలతో పాటు వందల కొద్దీ చిన్న పార్టీలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని నిరంతరం మారుస్తున్నాయి. మరి ఎన్నో పార్టీలకు నిలియంగా ఉన్నటువంటి భారతదేశంలో అత్యంత ధనిక సంపన్నమైనటువంటి పార్టీ ఏది అనే విషయంపై సర్వేలు నిర్వహించారు అయితే ఈ సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాల వివరాలు బయటపడటంతో, 2008 నుండి 2024 వరకు భారత రాజకీయాల్లో నిధుల ప్రవాహం ఎలా ఉందో స్పష్టమైంది. ఈ వివరాలు దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న పార్టీల ఆర్థిక స్థితిగతులను వెల్లడిస్తున్నాయి.దేశంలో అత్యంత ధనిక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిలిచింది. దశాబ్దానికి పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 2008 నుండి 2024 వరకు అందిన విరాళాలు అక్షరాలా రూ. 8,251.75 కోట్లు. ఈ స్థాయిలో ఏ పార్టీకి కూడా నిధులు రాలేదని చెప్పాలి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నో పార్టీలు ఉన్నాయి మరి ఈ పార్టీలలో ఏ పార్టీ అత్యంత ఎక్కువగా నిధులు రాబట్టాయనే విషయానికి వస్తే…ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) రూ. 503.94 కోట్లతో ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు పొందిన వాటిలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి రూ. 320.68 కోట్లు అందాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి రూ. 383.65 కోట్లు విరాళాలు అందాయి. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ కూడా గణనీయమైన నిధులను సమీకరించింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో వైసిపి పార్టీ అత్యంత ఎక్కువగా నిధులను సేకరించిన పార్టీగా గుర్తింపు పొందింది.