మోదీ వల్ల దేశం సర్వనాశనం అవుతుందంటున్న కేసీఆర్..

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. మోదీ పాలనలో దేశం సర్వనాశనం అవుతుంది అని అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచుతామని చెప్పి అప్పులపాలు చేశారంటూ.. ధరలు కూడా విపరీతంగా పెంచుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు.

అంతేకాకుండా ఆయనను చూసి ఫోర్డ్ లాంటి విదేశీ కంపెనీలు వెళ్లిపోయాయని. బ్యాంకుల్లో ఎన్పీఏలు భారీగా పెంచారు అని.. ఇదేనా తమ ప్రభుత్వ గొప్పతనం అంటూ ప్రశ్నించారు. పైగా ఏ ప్రధాని హాయంలో లేనంతగా రూపాయి విలువ పడిపోయింది అంటూ.. ఎంత నల్లధనం తెచ్చారు అంటూ గట్టిగా ప్రశ్నించారు. ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారడంతో మోదీ ప్రభుత్వ నాయకులు కేసీఆర్ పై రాష్ట్ర తీరు పట్ల విమర్శలు చేస్తున్నారు.