ఆమెతో సీక్రెట్స్ అన్ని చెప్పేసిన యాంకర్ సుమ.. ఇండియా కాకుండా ఆ దేశం ఇష్టం అంటూ!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన.ఇలా బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె వెండితెరపై తన సత్తా ఏంటో చూపించడానికి జయమ్మ పంచాయతీ సినిమా ద్వార నేడు వెండితెర పైకి వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారని చెప్పాలి. యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా సుమ మంచి గుర్తింపు పొందింది. ఇకపోతే జయమ్మ పంచాయతీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో బుల్లితెర కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే అమ్మ చేతి వంటకం ఫేమ్ భార్గవితో కలిసి ఈమె వంట చేస్తూ తన సినిమా ప్రమోషన్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే సుమ తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా స్వయంగా అమ్మ చేతి వంటకం భార్గవి ఇంటికి వెళ్లి తనతో ఎన్నో సినిమా ముచ్చట్లు చెబుతూ అక్కడ సుమ స్వయంగా వంట చేసి రుచి చూపించారు.ఇక ఈ వీడియోలో భాగంగా భార్గవి సుమను పలు ప్రశ్నలు అడుగుతూ సుమ నుంచి సమాధానాలు రాబట్టారు.ఈ క్రమంలోనే భార్గవి సుమని ప్రశ్నిస్తూ ఇండియా కాకుండా మీకు ఇష్టమైన ప్రదేశం ఏది అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు ఇండియా కాకుండా స్విజర్లాండ్ అంటే ఎంతో ఇష్టమని,ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుమ తనకు ఎంతో ఇష్టమైన స్విజర్లాండ్ గురించి తెలియజేశారు. అలాగే భార్గవి సినిమాకి సంబంధించిన ఎన్నో విశేషాలను అడిగి తెలుసుకున్నారు.ఈ విధంగా సుమ అమ్మ చేతి వంటకం భార్గవిను కలిసి తన ఇంట్లో వంట చేస్తూ సందడి చేసినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇకపోతే సుమ నటించిన జయమ్మ పంచాయతీ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.