దాదాపు రెండు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ చైనాలో పుట్టి ప్రపంచ దేశాల్లో విలయతాండవం సృష్టించడంతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన విషయం మనందరికీ తెలిసింది. కరోనా వైరస్ తీవ్రతతో లక్షలమంది ప్రాణాలు కోల్పోగా కరానా వైరస్ బారి నుంచి బయటపడిన చాలామంది ఇప్పటికీ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ ను మన శాస్త్రవేత్తలు కట్టడి చేసినప్పటికీ కొత్త కొత్త వేరియార్లతో దశలవారీగా ప్రజలపై విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా దేశంలో
మరో కొత్త కొత్త రకం కరోనా వేరియంట్‌ను గుర్తించారు.
తాజాగా దేశంలో గుర్తించబడిన కోవిడ్ వేరియంట్‌లో
డెల్టా తరహా ఉత్పరివర్తనాలతో ఒమైక్రాన్ ఉప సంతతికి చెందిన ఈ కొత్త వేరియంట్ సీహెచ్ 1.1గా గుర్తించారు. కోవిడ్ సెకండ్ వేవ్‌కు ప్రధాన కారణమై లక్షలాది మంది ప్రాణాలు బలిగొన్న అత్యంత ప్రమాదకర డెల్టా వేరియంట్‌లో ఉన్నట్టుగానే కొత్తగా కనుగొనబడిన సీహెచ్ 1.1 లోనూ ఉత్పరివర్తనాలు ఉండటంతో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ వేరియంట్‌పై పరిశోధనలు చేస్తున్నారు.
కోవిడ్ సీహెచ్ 1.1 వేరియంట్‌లో రోగ నిరోధకతను తప్పించుకునే లక్షణాలతో పాటు డెల్టాలోని ఆర్ మ్యుటేషన్‌ను కలిగి ఉండటంతో దేశంలోని శాస్త్రవేత్తలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కొత్త వేరియంట్ సీహెచ్ 1.1 వైరస్ ఇప్పటికే దేశంలోని మహారాష్ట్ర, యూపీ గుజరాత్ రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఈ చలికాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు వైద్యులు ప్రజలను హెచ్చరించడం జరిగింది. నిమోనియా, దగ్గు జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే మాస్కు ధరించి వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. ఇప్పటికే మహారాష్ట్రలో దాదాపు 20 సీహెచ్ 1.1 వైరస్ కేసులు బయటపడగా, తాజాగా గుజరాత్ లో మరో రెండు కేసులను వైద్యులు గుర్తించినట్లు సమాచారం.