ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో అమలు దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక మేనిఫెస్టో మొత్తానికి కీలకమైన అంశం మద్యపాన నిషేదం. ఐదేళ్లలో మొత్తం మందుబాబుల్ని అందర్నీ మార్చి చూపిస్తానని మాటిచ్చారు. ఇప్పుడు ఆ దిశగా యంత్రాంగం కుదులుతోన్న సంగతి తెలిసిందే. ఏపీలో లిక్కర్ షాపులు తగ్గించడం..బ్లాక్ మార్కట్ ను అరికట్టడం…కొత్త బ్రాండ్లను మార్కెట్ లోకి దించడం..చుక్కలు కనిపించేలే ధరలు పెంచడంతో! ఏపీలో విక్రయాలు అమాంతం పడిపోయిన మాట వాస్తవం. లాక్ డౌన్ సమయంలో నెల రోజులుగా మద్యం దుకాణాలు లేకపోవడం..అటుపై షాపులు ఓపెన్ చేయడం ధరలను 75 వాతం పెంచడంతో రెండు, మూడు రోజులు వరుస కట్టి హడావుడి చేసిన మత్తుబాబులు ఇప్పుడంతా చల్లబడిపోయారు.
ధరలు పెంచడంతో రాష్ర్టంలో దాదాపు అన్ని షాపులు ఖాళీగా ఉంటున్నాయి. విక్రయాలు లేక ఈగలు కొట్టుకుంటున్నామని సూపర్ వైజర్లు చెబుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే జగన్ షాక్ గట్టిగానే తగిలిందని అంటున్నారు. సీఎంగారి ప్లాన్ బాగా వర్కౌట్ అయిందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రోజు మందు తాగే వారిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని విక్రయాలు జరిపే సిబ్బంది అంటున్నారు. రోజు మద్యం తీసుకునేవారు ఈసారి మూడు రోజులకు ఒకసారి మాత్రమే మద్యం కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇన్నాళ్లు మద్యం అనేది ఓ అలవాటుగా మారిపోయింది కాబట్టే ప్రభుత్వాలు సొమ్ము చేసుకున్నాయని, కానీ జగన్ అలాంటి ఆలోచన లేకుండా ఆరోగ్యం బాగుండాలని కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే మద్యాన్ని బ్యాన్ చేసే దిశగా అడుగులు వేయడం నిజంగా గొప్ప విషయమని నిపుణులు అభిప్రయపడు తున్నారు.
ఇక ఎక్సైజ్ శాఖ అక్రమాలకు పాల్పడకుండా నాటు సారా వంటివి తయారు చేయకుండా ఉంటే మద్యం ప్రియులు మత్తు వదలడానికి ఎంతో సమయం పట్టదని తెలుస్తోంది. ఇవన్నీ పరిశీలిస్తే జగన్ ఏడాదిలోనే మద్యపాన నిషేధం విషయంలో చాలా మార్పులు తీసుకొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయంలో జగన్ పై మందు బాబులు కారాలు మిరియాలు నూరినా కొన్నాళ్లకి వాస్తవాల్ని కచ్చితంగా గ్రహిస్తారన్నది మాత్రం నిజం.