శృంగారంలో పాల్గొంటే చర్మంపై మొటిమలు ఏర్పడతాయా… ఇది ఎంతవరకు నిజం?

సాధారణంగా చాలామంది శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా ఈ విషయాల గురించి మాట్లాడటానికి ఆలోచిస్తూ ఉంటారు.అయితే శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడటం పెద్ద తప్పు కాదని కొన్ని దేశాలలో శృంగారం గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక పాఠాలను కూడా పిల్లలకు అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే చాలామంది శృంగారంలో పాల్గొంటే చర్మంపై మొటిమలు ఏర్పడతాయన్న అపోహలో ఉంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమో ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే…

శృంగారంలో పాల్గొనడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు ముఖంపై మొటిమలు ఏర్పడతాయి అనేది కేవలం అపోహ మాత్రమేనని తెలిపారు.శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరం పై మొటిమలు మచ్చలు ఎలాంటి పరిస్థితులలోనూ ఏర్పడమని తెలిపారు అయితే మనం కొన్ని జాగ్రత్తలు పాటించినప్పుడే ఇలాంటి సమస్యలు ఏర్పడమని నిపుణులు తెలియజేస్తున్నారు. సాధారణంగా శృంగారం చేసేటప్పుడు మన శరీరం నుంచి చెమట వెలబడుతుంది. ఈ చెమట కారణంగా మన శరీరం నుంచి కొవ్వులు ఉత్పత్తి అవుతూ చర్మంపై మొటిమలు మచ్చలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది.

అదేవిధంగా శృంగార సమయంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరి శరీరాలను ఒకరు తాకుతూ ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చాలామంది వివిధ రకాల బాడీ స్ప్రేలు లేదా ఆయిల్ ఉపయోగిస్తూ ఉంటారు అయితే అవి వారి జీవిత భాగస్వామికి సరిపడనప్పుడు ఇలాంటి చర్మ సమస్యలు ఎదురవుతుంటాయి తప్ప సెక్స్ వల్ల ఎలాంటి చర్మ సమస్యలు మొటిమలు ఏర్పడమని నిపుణులు చెబుతున్నారు.అయితే శృంగారంలో పాల్గొన్న తర్వాత శుభ్రంగా స్నానం చేయడం వల్ల ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలు కానీ లైంగిక సమస్యలు కానీ తలెత్తవని నిపుణులు వెల్లడించారు.