Kodali Nani: గుండె సమస్యలతో కొడాలి నాని…. సర్జరీ తప్పదు అంటున్న వైద్యులు?

Kodali Nani: వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్యానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈయన నిన్న ఉదయం ఉన్నఫలంగా గుండె నొప్పి సమస్యతో హైదరాబాద్లోని ఏఐజి ఆసుపత్రికి వెళ్లారు అయితే అక్కడ వైద్యులు పరీక్షలను నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే గ్యాస్టిక్ సమస్య కారణంగా ఛాతీ నొప్పి వచ్చినట్లు భావించారు. ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సిన పనిలేదని వైద్యులు వెల్లడించారు.

ఈయన ఆరోగ్య పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందంటూ వచ్చిన వార్తలను ఖండించారు. అయితే ఏ ఐ జి హాస్పిటల్ కి వెళ్లినటువంటి కొడాలి నానికి వైద్యులు పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే వైద్యులు ఈయన ఆరోగ్యం పై పలు విషయాలను వెల్లడించారు. నాని గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు.

మూడు వాల్వులు బ్లాక్ అయినట్లు పరీక్షల్లో తేలినట్లు వెల్లడించారు. ఆపరేషన్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే, అత్యవసరంగా చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక, నాని ఆరోగ్య పరిస్థితి పైన ఏఐజీ వైద్యులతో మాజీ సీఎం జగన్ మాట్లాడారు. సర్జరీ గురించి చర్చించారు.

ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాని ఆరోగ్యం గురించి వైద్యులతో అలాగే నాని కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ఇలా మూడు వాల్వులు బ్లాక్ అవ్వడ వల్ల సర్జరీ అయితే తప్పనిసరి అని చెప్పారు కానీ వెంటనే చేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.స్టంట్ లు వేయడమా, బైపాస్ సర్జరీ చేయడమా అనే అంశం పైన సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని నాని కుటుంబం సభ్యులు భావిస్తున్నారు. ఇందు కోసం కొడాలి నాని సైతం ఇతర హాస్పిటల్స్ వైద్యులతో సంప్రదింపులు చేస్తున్నారు.