కోలీవుడ్ సీనియర్ నటుడు, కెప్టెన్ విజయ్ కాంత్ గత కొంత కాలం నుండి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. తాజాగా వైద్యులు ఈయన కుడికాలి మూడు వేళ్లను తొలగించారు. ఇతడికి షుగర్ ఉండటం వల్ల వీళ్లకు రక్త సరఫరా లేకపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు.
ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని తమ పార్టీ అయిన డీఎండీకే వెల్లడించింది. మరో రెండు రోజులు ఆయన డిశ్చార్జ్ అవుతారని తెలిసింది. ఈయన త్వరగా కోలుకోవాలి అని స్టాలిన్, రజినీకాంత్ లు ఆకాంక్షించారు.