Weight Loss Tips: బరువు తగ్గాలని భావిస్తున్నారా.. పొరపాటున కూడా ఈ పండ్లు తినకూడదు!

Weight loss tips: ఈ ఆధునిక కాలంలో చిన్న, పెద్ధ భేదం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య అధిక బరువు పెరగడం. అధిక బరువును తగ్గించుకోవడానికి డైట్ చేయడం, వ్యాయామాలు చేయడం, వాకింగ్, వంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే బరువు తగ్గడం అంత ఆషామాషీ కాదు. చాలా మంది తిండి మానేసి.. పచ్చి కూరగాయలు తినడం, పండ్లను తినడం చేస్తుంటారు. ఇలాంటి వారికి కొంచెం సత్ఫలితాలు ఉంటాయి. కానీ చాలా మంది తినడానికి ముందు ఫ్రూట్ సలాడ్ తింటుంటారు. వీటిలో అనేక రకాల పండ్లను ఉపయోగిస్తుంటారు. సలాడ్ లో ఉపయోగించే కొన్ని పండ్లు శరీర బరువును తగ్గించడానికి ఉపయోగపడితే మరీ కొన్ని బరువు పెంచడానికి సహాయపడతాయి. ఆ ఫ్రూట్ ఏవో ఒక లుక్ వేద్దాం.

అరటి: మనలో అనేక మంది ఇష్టంగా తినే పండు ఇది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది తినడం వల్ల జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఒక అరటిపండులో దాదాపుగా 150 కేలరీలు ఉంటాయి. ఇందులో చక్కెర కూడా అధికంగా ఉంటుంది. రోజుకి 2 లేదా 3 పండ్లకంటే ఎక్కువ తినకూడదు.

అవకాడో: అవకాడో పండ్లలో కొవ్వులు, కేలరీలు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల పండ్లలో 160 కేలరీలు ఉంటాయి. ఇవి మీ శరీర బరువును పెంచుతాయి. బరువు తగ్గాలి అనుకునే వారు అవకడో పండ్లు తక్కువ తినటం మంచిది.

ద్రాక్ష: ద్రాక్షలో చెక్కెర, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల ద్రాక్షలో 16 గ్రాముల చక్కెర మోతాదు, 67 గ్రాముల కేలరీలు ఉంటాయి. మీరు కనుక డైట్ చేస్తున్నట్టు అయితే ద్రాక్షను తక్కువగా తినాలి.

పైనాపిల్: పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. అయితే దీనిలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. కేలరీలు కూడా అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునేవారు పైన తెలిపిన పండ్లను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.