Health Tips: మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా?ఈ నూనె మంచి ఔషధంలా పనిచేస్తుందని తెలుసా?

Health Tips:ఈ ఆధునిక కాలంలో అనారోగ్య సమస్యల బారిన పడేవారు ఎక్కువయ్యారు. వీటిలో మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద అందరూ ఎక్కువగా మోకాళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. ఈ సమస్య ఎవ్వరికి వచ్చిన ఇది దీర్ఘకాలికంగా ఉండే సమస్య. ఆహారపు అలవాట్లను బట్టి, ఎముకల దృఢత్వాన్ని బట్టి ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికి అనేక రకాల పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఉపయోగిస్తుంటారు.

పూర్వం ఈ సమస్యలు వయస్సు పైబడిన తర్వాత ఎక్కువగా వచ్చేవి. కానీ మారిన ఆహారపు అలవాట్ల , శారీరక శ్రమ లేకపోవడం, రసాయనాలు కలిపిన ఆహారం తీసుకోవటం వంటి వాటి వల్ల ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారు. శారీర బరువు పెరగడం, దెబ్బలు తగలడం, పోషక ఆహార కొరత కూడా మోకాళ్ల నొప్పులకు కారణం అవుతున్నాయి. నొప్పులు ఎక్కువ ఉన్నాయి అని పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడితే వాటి వల్ల కలిగే లాభం కన్న నష్టమే ఎక్కువ. అయితే మోకాళ్ల నొప్పులను నివారించడం ఎలా? సహజ పద్దతిలో తగ్గించుకోవడం సాధ్యమేనా? తగ్గించే మార్గం ఏమిటి అని ఈ ఆర్టికల్ లో చదవండి.

ఒక మీడియం సైజ్ లో ఉండే అల్లం ముక్కను తీసుకొని దాని తోలు తీసేసి నీటిలో శుభ్రంగా కడగాలి. కడిగిన అల్లం ను ముక్కలుగా తురుముకోవాలి. ఒక స్పూన్ మిరియాలు తీసుకొని దానిని దంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిమీద ఒక పాత్ర పెట్టాలి. అందులోకి ఒక కప్పు నువ్వుల నూనె పోయాలి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత అల్లం తురుము ,మిరియాల పొడి మిశ్రమాన్ని అందులో వేసి చిన్న మంట పెట్టి మెల్లగా గరిటతో తిప్పుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి, చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని వడబోసి, ఆ నూనెను ఒక సీసాలో భద్రపరుచుకోవాలి.

ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు మోకాళ్ళ మీద పదిహేను నిమిషాలు మెల్లగా మర్దన చేయాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు మాయమవుతాయి. ఈ నూనెను నడుము నొప్పి ఉన్న వారు కూడా, నొప్పి ఉన్న చోట మెల్లగా మర్దన చేస్తే నొప్పి తగ్గుతుంది. దీర్ఘకాలిక మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ నూనెను ఉపయోగించడం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.