Health Tips: ప్రస్తుత కాలంలో జీవనశైలిలో మార్పు రావటం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతిరోజు సమయానుకూలంగా పౌష్టికాహారం తీసుకోవడం, ప్రతిరోజు 7 గంటల సేపు తప్పనిసరిగా నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నియంత్రించవచ్చు. ప్రస్తుతకాలంలో అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్యలలో వెన్ను నొప్పి సమస్యలు కూడా ప్రధానమైనవి గా చెప్పుకోవచ్చు. వయసు పెరగటం, ఒకే చోట కూర్చుని ఎక్కువసేపు పని చేయడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి.
చాలామందివెన్నునొప్పిని సాధారణ సమస్యగా భావించి చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయటం వల్ల ప్రమాదం ఎదుర్కోవలసి వస్తుంది. వెన్ను నొప్పి తీవ్రత ఎక్కువ అయితే మంచానికి పరిమితం కావాల్సి వస్తుంది. వెన్ను నొప్పి సమస్య రావటానికి గల కారణాల గురించి తెలుసుకుందాం.
సాధారణంగాప్రస్తుత కాలంలో చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో గంటల తరబడి కదలకుండా ఒకే దగ్గర కూర్చొని కంప్యూటర్ ముందు పని చేయాల్సి వస్తుంది. ఇలా ప్రతి రోజూ గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చుని పని చేయటం వల్ల వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది.
శరీర బరువు మోయగలిగే దాని కన్నా అధిక బరువు మోయటం, జిమ్ లో వ్యాయామాలు చేసే సమయంలో శరీరం దృఢత్వం కోసం అధిక బరువు ఎత్తటం వల్ల కండరాలు పట్టేసి వెన్ను నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఇలా అధిక బరువు మోయక పోవటమే మంచిది.