Smoking: తరచూ స్మోకింగ్ చేస్తున్నారా? ఈ పదార్థాలు తప్పక తీసుకోవాల్సిందే..!

Smoking: ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎక్కువగా ధూమపానం మరియు మద్యపానానికి బానిసలవుతున్నారు. కొంతమంది ఒత్తిడి భరించలేక ఉపశమనం కోసం పొగ త్రాగడం అలవాటు చేసుకుంటే మరికొందరు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి స్మోకింగ్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో యువత మరీ ఎక్కువగా ఈ అలవాటు బారిన పడుతున్నారు. కొన్ని ప్రదేశాలలో అయితే ఆడవారు కూడా స్మోకింగ్ చేస్తున్నారు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని థియేటర్ కి వెళ్లిన ప్రతిసారి మనకి దర్శనమిచ్చే ఒక ప్రకటన. ఇంకా కొన్ని సినిమా లలో అయితే పొగ త్రాగకండి, తాగితే పోతారని కూడా చెబుతుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా తగ్గేదెలా అన్న విధంగా తయారయ్యారు.

ఏదైనా చెడు అలవాటు అయినంతగా త్వరగా మంచి బుర్ర కి ఎక్కదు. ఒక సారి ధూమపానానికి బానిస అయితే అది మానుకోవడం చాలా కష్టమైన పని. స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులు, గుండె, మెదడు పనితీరు మీద ప్రభావం చూపుతుంది. ఇది క్యాన్సర్ కు దారితీసి ప్రాణాలను హరించే ప్రమాదం కూడా ఉంది. దీని దుష్ప్రభావాలు తెలిసి కూడా ఈ అలవాటుకి దూరంగా ఉండాలి అనుకున్న వారు ఉండలేరు. స్మోకింగ్ అలవాటు ఉన్నవారు వారి ఆరోగ్యాన్ని కనీసం జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటే, వారి డైట్ లో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవాలి.

• స్మోకింగ్ చేయటం వల్ల శరీరంలో నికోటిన్ స్థాయి పెరుగుతుంది. నికోటిన్ ను తొలగించడానికి ఉల్లి, వెల్లుల్లి లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు తినే ఆహార పదార్థాలలో ఉల్లి, వెల్లుల్లిని అధికంగా చేర్చుకోవడం వల్ల శరీరంలో పేరుకు పోయిన నికోటిన్ ను తగ్గించుకోవచ్చు.
• స్మోకింగ్ చేయడం వల్ల దెబ్బతిన్న లివర్ ను కాపాడుకోవాలి అంటే వారంలో కనీసం మూడు సార్లు అయినా క్యారెట్, బీట్ రూట్ లను జ్యూస్ చేసి తాగాలి.
• స్మోకింగ్ అలవాటు ఉన్నవారు వీలైనంత ఎక్కువ డ్రైఫ్రూట్స్ ను తినడం వల్ల వారి రోగనిరోధక శక్తి మెరుగుపడి ఎక్కువగా జబ్బుల బారిన పడకుండా ఉంటారు.
• అల్లం టీ, సిట్రస్ ఫ్రూట్స్, దానిమ్మ రసం, యాపిల్, పసుపు, పెరుగు, గుమ్మడికాయ,వలన కూడా స్మోకింగ్ నుండి కలిగే దుష్ప్రావాలను నిర్మూలించవచ్చు.
• స్మోకింగ్ చేసేవారికి గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.గుండె జబ్బుల నుండి రక్షించుకోవాలంటే ఆకుకూరలు , డ్రై ఫ్రూట్స్ ఆహారంలో చేర్చుకోవాలి.