Hair care -Fartility: జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి అనేక మంది అనేక రకాల విధానాలు అవలంభిస్తుంటారు. సాధారణంగా జుట్టు కు ఎటువంటి నూనె పెట్టకపోయినా కూడా, అందులో ఉండే కొన్ని రకాల గుణాల వల్ల వాటంతట అవే నూనె లాంటి పదార్థాలను ఉత్పత్తి చేసుకుంటాయి. అయితే ఈ జిడ్డు కూడా కనిపించకుండా అనేక మంది ప్రతి రోజు షాంపూ ఉపయోగించి స్నానం చేస్తుంటారు. దీని వల్ల జుట్టు జిడ్డు గా కనపడకుండా సిల్కీ గా ఉంటుంది. ఇలాంటి వారి సంఖ్య అనేకం. ప్రతిరోజు షాంపూను వినియోగించడం వల్ల జుట్టు వెంటనే సిల్కీ గా అవుతుంది, కాని దీని వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి.
షాంపూ లలో ఎక్కువ మోతాదులో కెమికల్స్ ఉపయోగిస్తారు. వీటిని తరచూ ఉపయోగించడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య పరమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో ఆందోళనకరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ పరిశోధన చాలా మంది మహిళలపై జరిగింది. దీని ఫలితం చూసి చాలామంది పరిశోధకులు ఆందోళనకు గురయ్యారు. మార్కెట్లో లభించే కొన్ని రకాల పేరుగాంచిన షాంపూలు, హెయిర్ ప్రొడక్ట్స్ వినియోగించడం వల్ల సంతానోత్పత్తి పై ప్రభావం చూపుతోందని అధ్యయనంలో తేలింది. ప్రతి రోజు షాంపూ ని ఉపయోగించడం వల్ల గర్భం దాల్చే సామర్త్యం పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఫలదీకరణం సమస్యలను కలిగిస్తుంది. అయితే ఇది ఆడవారి మీద మాత్రమే కాకుండా మగవారి మీద కూడా ప్రభావం చూపుతుంది అని అధ్యయనంలో వెల్లడైంది.
మార్కెట్ లో లభించే హెయిర్ ప్రొడక్ట్స్, షాంపూ లలో అనేక రకాల కెమికల్స్ ఉంటాయి. వీటిలో ఉండే మిథైల్ నేరుగా శరీరం మీద ప్రభావం చూపుతుంది. ఎటువంటి సమస్యను అయిన పరిష్కరించడానికి మార్గం ఉన్నట్టే, దీనిని నివారించడానికి ఒక మార్గం ఉంది. సహజమైన షాంపూలు లేదా ఉత్పత్తులను వినియోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని పరిశోధకులు తెలిపారు. ఏదైనా ప్రసిద్ధ రసాయన ఆధారిత హెయిర్ కలర్, హెయిర్ షాంపూ లేదా ఇతర ఉత్పత్తులు వినియోగించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉపయోగించాలని చెబుతున్నారు. ప్రతిరోజు తలస్నానం చేయడం కూడా సరైన పద్ధతి కాదని నిపుణులు పేర్కొంటున్నారు.